శోభితకు యూనిక్ ఐడెంటిటీ ఇచ్చిన పాత్ర
శోభితా ధూళిపాళ తన సోషల్ మీడియాలో పోస్టర్ ని షేర్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. కోస్టార్ ఆదిత్యను సరదాగా ఆటపట్టిస్తూ ఒక వ్యాఖ్యను కూడా జోడించింది.
By: Tupaki Desk | 17 Feb 2025 5:06 PM GMTతన అద్భుత నటనతో కట్టి పడేసే ప్రత్యేకత శోభిత ధూళిపాల సొంతం. భారతదేశంలో ప్రత్యేకత ఉన్న నటీమణుల జాబితాలో శోభిత పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాను నటించిన అతి కొద్ది చిత్రాలతోనే తన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. నేటితరంలో తనదైన నటన, శైలితో ప్రత్యేకంగా నిలవడంలో సహకరించిన ఒక పా`త్ర `ది నైట్ మేనేజర్`లోని కావేరీ ధీక్షిత్. ఈ పాత్రలో అందాన్ని ఎలివేట్ చేస్తూనే, నటనతో మెస్మరైజ్ చేసింది శోభిత. అందుకే ఇది తన కెరీర్ లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది.
ది నైట్ మేనేజర్ రెండో వార్షికోత్సవం సందర్భంగా, ఆదిత్య, శోభిత టీమ్ తో సంభాషించారు. శోభితా ధూళిపాళ తన సోషల్ మీడియాలో పోస్టర్ ని షేర్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. కోస్టార్ ఆదిత్యను సరదాగా ఆటపట్టిస్తూ ఒక వ్యాఖ్యను కూడా జోడించింది. ప్రస్తుతం వారి సోషల్ మీడియా సంభాషణలు అభిమానుల్లో వైరల్ గా మారాయి. శోభిత ఇలాంటి మరిన్ని పాత్రలు చేయాలని అభిమానులు ఆకాంక్షించారు.
ది నైట్ మేనేజర్ లో కావేరీ దీక్షిత్ పాత్రను శోభిత ధూళిపాళ పోషించిన తీరు ఒక యూనిక్ ప్రాసెస్ అని క్రిటిక్స్ ప్రశంసించారు. షో ఆద్యంతం అద్భుతమైన గ్లామర్‌ను ప్రదర్శించినా, దానిని తన నటన డామినేట్ చేసిందంటూ ప్రేక్షకులు ప్రశంసించారు. ఆదిత్య, శోభితల కెమిస్ట్రీని కూడా ప్రేక్షకులు ఇష్టపడ్డారు. శోభిత ఇటీవల అక్కినేని నాగచైతన్యను పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా కెరీర్ ని బ్యాలెన్స్ చేయనుంది.