Begin typing your search above and press return to search.

తెలుగు అమ్మాయి టాలెంట్ కి పడిపోయిన హాలీవుడ్ స్టార్..!

తెలుగు అమ్మాయే అయినా శోభిత ధూళిపాళ చేసే క్రేజీ అటెంప్టులు ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి

By:  Tupaki Desk   |   7 April 2024 12:30 AM GMT
తెలుగు అమ్మాయి టాలెంట్ కి పడిపోయిన హాలీవుడ్ స్టార్..!
X

తెలుగు అమ్మాయే అయినా శోభిత ధూళిపాళ చేసే క్రేజీ అటెంప్టులు ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. తన ఫోటో షూట్స్ తోనే ఇంటర్నెట్ ని షేక్ చేసే అమ్మడు తెలుగులో డిఫరెంట్ సినిమాలతో అలరిస్తూ వస్తుంది. రెగ్యులర్ హీరోయిన్స్ లా రెండు సీన్లు, మూడు పాటలు సినిమాల్లో కనిపించడానికి ఇష్టపడని శోభిత ప్రయోగాత్మక సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్, హాలీవుడ్ మేకర్స్ ని ఆకర్షిస్తుంది. లేటెస్ట్ గా శోభిత నటించిన సినిమా మంకీ మ్యాన్ శుక్రవారం అమెరికాలో రిలీజైంది.

స్లమ్ డాగ్ మిలీనియర్ యాక్టర్ దేవ్ పటేల్ డైరెక్షన్ లో తెరకెక్కిన మంకీ మ్యాన్ సినిమా యూఎస్ లో రిలీజ్ అవ్వగా ఈ సినిమా ఇండియాలో ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో దేవ్ పటేల్ తెలుగు అమ్మాయి శోభిత గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. మంకీ మ్యాన్ సినిమా లో శోభిత ఎప్పటికీ గుర్తిండిపోయే పాత్ర చేసిందని. ఆమె కేవలం అందగత్తె మాత్రమే కాదు గొప్ప నటి అని అన్నారు దేవ్ పటేల్. ఇలాంటి సంపూర్ణమైన నటిని తను చూడలేదని అన్నారు దేవ్.

మంకీ మ్యాన్ సినిమాలో తన వారి కోసం పోరాడే అద్భుతమైన పాత్రలో శోభిత నటించింది. ఈ సినిమాలో భాగమైనందుకు శోభిత కూడా తన సంతోషాన్ని వ్యక్త పరిచింది. నటుడిగానే కాదు దేవ్ పటేల్ డైరెక్షన్ విజన్ లో భాగం అయినందుకు ఆనందంగా ఉందని మంకీ మ్యాన్ ప్రమోషన్స్ లో శోభిత అన్నారు.

పాత్ర నచ్చితే చాలు అది ఎలాంటి సినిమా అయినా చేస్తానని అంటుంది శోభిత. గూఢచారి, మేజర్ సినిమాల్లో నటించిన శోభిత రానున్న సినిమాలతో మరిన్ని ప్రయోగాలు చేయాలని చూస్తుంది. మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్ లో తన సత్తా చాటాలని చూస్తున్న శోభితాకు అక్కడ నుంచి మరిన్ని గొప్ప అవకాశాలు రావడం కన్ఫర్మ్ అని చెప్పుకుంటున్నారు.

మంకీ మ్యాన్ సినిమా విషయానికి వస్తే హనుమంతుడు స్పూర్తితో బలహీనమైన ప్రజలను దోచుకుని వారిని ఇబ్బంది పెట్టే బలవంతుల ఆట కట్టించే వ్యక్తి కథతో వస్తుంది. ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే సినిమాపై బజ్ పెంచగా ఇండియాలో కూడా మంకీ మ్యాన్ అద్భుతాలు చేస్తుందని అంచనా వేస్తున్నారు మేకర్స్.