Begin typing your search above and press return to search.

కేన్స్‌లో ర‌ఫ్ఫాడించిన శోభిత ధూళిపాల‌

తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ కొనసాగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరంగేట్రం చేసింది

By:  Tupaki Desk   |   19 May 2024 3:41 AM GMT
కేన్స్‌లో ర‌ఫ్ఫాడించిన శోభిత ధూళిపాల‌
X

తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ కొనసాగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరంగేట్రం చేసింది. ఈ బ్యూటీ వ‌రుస ఫోటోషూట్లు అంత‌ర్జాలాన్ని వేడెక్కిస్తున్నాయి. ర‌క‌ర‌కాల వెరైటీ డిజైన‌ర్ లుక్ ల‌తో శోభితా ధూళిపాళ మ‌తులు చెడ‌గొడుతోంది. ట్యాలెంటెడ్ బ్యూటీ మునుపెన్న‌డూ లేనంత హాట్ గా క‌నిపిస్తోందంటూ కితాబును అందుకుంది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి శోభిత క్యాట్ వాక్ ల‌కు సంబంధించిన‌ చాలా ఫోటోలు సోషల్ మీడియాల్లో వైర‌ల్ గా దూసుకెళుతున్నాయి. శోభిత అంద‌మైన డిజైన‌ర్ దుస్తుల్లో మ‌రోసారి మ‌తులు చెడ‌గొట్టింది. తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోషూట్ లో శోభిత ఎంతో ప్ర‌త్యేకంగా కనిపిస్తోంది. పూర్తిగా బాడీ హగ్గింగ్ ఫ్రాక్ లో శోభిత హొయ‌లు పోయింది. ఈ ఫ్రాక్ లో తెలుగమ్మాయి అంద‌చందాల ఎలివేషన్ క‌ట్టి ప‌డేస్తోంద‌ని చెప్పాలి. శోభిత స్ట్రైకింగ్ ఫోజ్‌లు, భంగిమ‌లు సంథింగ్ హాట్ అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

శోభితతో పాటు ఈ కార్యక్రమానికి కేన్స్ రెగ్యులర్ సెల‌బ్రిటీ ఐశ్వర్య రాయ్ కూడా హాజరయ్యారు. అదితి రావ్ హైదరీ , కియారా అద్వానీ కూడా ఫిల్మ్ ఫెస్టివల్‌లో జాయిన‌య్యారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.... దేవ్ పటేల్ న‌టించి తొలిసారి దర్శకత్వం వహించిన `మంకీ మ్యాన్`లో శోభిత తన అద్భుతమైన నటనతో మెప్పించింది. ఇందులో పిటోబాష్, జతిన్ మాలిక్, సికందర్ ఖేర్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు.