Begin typing your search above and press return to search.

శోభితా క్రేజ్.. టాప్ స్టార్స్ కంటే ఎక్కువే..

గ్లామరస్ బ్యూటీ శోభిత దూళిపాళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

By:  Tupaki Desk   |   13 Aug 2024 6:07 AM GMT
శోభితా క్రేజ్.. టాప్ స్టార్స్ కంటే ఎక్కువే..
X

గ్లామరస్ బ్యూటీ శోభిత దూళిపాళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో ఈ పేరు గట్టిగానే ట్రెండ్ అవుతోంది. ఇక రీసెంట్ గా అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ జరిగింది. గత రెండేళ్లుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకోవడానికి ముందడుగు వేశారు. తాజాగా రెండు కుటుంబాల సమక్షంలో నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ జరిగింది.

ఈ ఎంగేజ్మెంట్ తర్వాత ఒకసారిగా సోషల్ మీడియాలో శోభిత దూళిపాళ్ల పేరు మార్మోగింది. ఆమె గురించి వెతకడం మొదలుపెట్టారు. అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, రెగ్యులర్ సినీ ప్రియులు కూడా శోభిత ధూళిపాళ్ల ప్రొఫైల్ సెర్చ్ చేశారు. ఆమె నటించిన సినిమాల గురించి ఆరా తీశారు. అలాగే గతంలో శోభిత నటించిన కమర్షియల్ యాడ్స్ ని కూడా వైరల్ చేశారు. దీంతో మొదటిసారి ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది.

ఈ వారం IMDB మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల జాబితాలో శోభిత దూళిపాళ్ల రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ట్రెండింగ్ హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటున్న సర్వారి మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా టాప్ 1లో ఉంది. ఆమె నటించిన కొత్త సినిమా వేధా ఆగష్టు 15న రిలీజ్ కాబోతోంది. శోభిత దూళిపాళ్ల, నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ న్యూస్ లలో ఒకటిగా మారిపోయింది.

సమంతతో విడాకుల తర్వాత 2022 నుంచి నాగ చైతన్య శోభితతో రిలేషన్ లో ఉన్నాడు. రెండు సార్లు వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే వాటిపై శోభిత ఎప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఫైనల్ గా నాగ చైతన్యతో ఆమె ఎంగేజ్మెంట్ చేసుకొని వివాహానికి సిద్ధమవుతోంది. దీంతో గూగుల్ లో శోభిత గురించి నెటిజన్లు ఎక్కువగా వెతికారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా మోస్ట్ పాపులర్ సెలబ్రెటీల జాబితాలోకి శోభిత వచ్చింది.

శోభిత తర్వాత పాపులర్ సెలబ్రెటీల జాబితాలో మూడో స్థానంలో షారుఖ్ ఖాన్ ఉన్నారు. నాలుగు, ఐదు స్థానాలలో కాజోల్, జాన్వీ కపూర్ నిలిచారు. తరువాత దీపికా పదుకునే, విజయ్ సేతుపతి, మృణాల్ ఠాకూర్, ఐశ్వర్య రాయ్ ఉండటం విశేషం. ప్రతివారం IMDB మోస్ట్ పాపులర్ సెలబ్రెటీల జాబితాని ప్రకటిస్తూ ఉంటుంది. బాలీవుడ్ బ్యూటీ సర్వారి గత కొంతకాలం నుంచి టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.