Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: శోభిత‌ నడుము న‌య‌గారం

ఆమె న‌డుము న‌య‌గారం.. ఆ వాలు చూపుల్లో దాగి ఉంది గ‌మ్మ‌త్తు..! అందుకే యూత్ ఈ భామ అందానికి ఫిదా అయిపోయారు

By:  Tupaki Desk   |   1 July 2024 4:16 AM GMT
ఫోటో స్టోరి: శోభిత‌ నడుము న‌య‌గారం
X

ఆమె న‌డుము న‌య‌గారం.. ఆ వాలు చూపుల్లో దాగి ఉంది గ‌మ్మ‌త్తు..! అందుకే యూత్ ఈ భామ అందానికి ఫిదా అయిపోయారు. నేడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశ‌వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా ఎదిగింది తెలుగ‌మ్మాయి శోభిత ధూళిపాల‌. టాలీవుడ్ టు బాలీవుడ్ శోభిత హ‌వా అసాధార‌ణంగా ఉంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

వరుస‌గా కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ వెబ్ సిరీస్ ల‌లో న‌టించిన శోభిత‌, ఇండ‌స్ట్రీ క్రేజీ చిత్రాల్లోను న‌టించేస్తోంది. మేడ్ ఇన్ హెవెన్, నైట్ మేనేజర్ వంటి విజయవంతమైన వెబ్ షోల‌లో తన మరపురాని నటనతో అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. విమ‌ర్శ‌కుల‌ ప్రశంసలు పొందిన దేవ్ పటేల్ `మంకీ మ్యాన్` చిత్రంతో హాలీవుడ్ లోను అడుగుపెట్టింది. వైవిధ్యమైన పాత్రల్లో అద్భుత న‌ట‌న‌, ఆహార్యంతో మెప్పిస్తున్న ఈ బ్యూటీ న‌టిగా ఉన్నత ప్రమాణాన్ని నెలకొల్పిందన‌డంలో సందేహం లేదు. త‌దుప‌రి అడివి శేష్ తో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో న‌టిస్తోంది ధూళిపాల‌.

వెండితెరపై ధూళిపాళ మ‌రిన్ని ప్ర‌యోగాలు చేయాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. ఇటు హిందీ-తెలుగు చిత్రాల్లో న‌టిస్తూనే హాలీవుడ్ లోను న‌ట‌న‌ను కొన‌సాగిస్తుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. శోభిత ట్రైన్డ్ భ‌ర‌త‌నాట్యం క‌ళాకారిణి. అందుకే అభిన‌య‌నేత్రిగా హృద‌యాల‌ను గెలుచుకుంటోంది. ప్ర‌స్తుతం సితార అనే చిత్రంలో న‌టిస్తోంది.