వైట్ అండ్ వైట్ లో టాలీవుడ్ హాట్ బ్యూటీ!
తెలుగమ్మాయి శోభిత దూళిపాళ సక్సెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ టూ హాలీవుడ్ వయా టాలీవుడ్ మీదగా దూసుకెళ్లిన బ్యూటీ.
By: Tupaki Desk | 6 April 2024 7:15 AM GMTతెలుగమ్మాయి శోభిత దూళిపాళ సక్సెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ టూ హాలీవుడ్ వయా టాలీవుడ్ మీదగా దూసుకెళ్లిన బ్యూటీ. ఓ తెలుగు నటి ఇంగ్లీష్ సినిమా చేయడం అన్నది నిజంగా ప్రశంసించదగ్గ విషయం. ఎంతో మంది తెలుగు భామలున్నా! ఎవరికీ సాధ్యం కానిది శోభిత సాధ్యం చేసి చూపించింది. సినిమా ఛాన్స్ అనేది ఇండియాలో ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. సొంత భాషలో యాచిస్తేగానీ అవకాశాలు రావు.
అలాంటిది ఏకంగా భాషకానీ భాషలో..దేశం కానీ దేశంలో వరల్డ్ లోనే ఫేమస్ అయ్యే హాలీవుడ్ లో అవకాశం అందుకుని షెభాష్ అనిపించింది శోభిత. ఆమె హాలీవుడ్ లో `మంకీ మ్యాన్` అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 5న ఆ చిత్రం రిలీజ్ అయింది. కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే రూపొందిన సినిమా త్వరలో ఓటీటీలో వస్తే ఇండియన్స్ చూసే అవకాశం ఉంది. అంతవరకూ `మంకీ మ్యాన్ `కోసం వెయిట్ చేయక తప్పదు.
ఇక బ్యూటీ సినిమా ప్రమోషన్ కోసం రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంది. అందులో భాగంగా హాలీవుడ్ కల్చర్ కు తగ్గట్టు మౌల్డ్ అయి నడుచుకుంటుంది. తాజాగా అలాంటి ఈవెంట్ కి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. లాస్ ఏంజిల్స్‌లోని చారిత్రాత్మక చైనీస్ థియేటర్లో `మంకీ మ్యాన్` రెడ్ కార్పెట్‌పై హోయలు పోయేందుకు అమ్మడు ఇలా ముస్తాబైంది. వైట్ కలర్ డిజైనర్ దుస్తుల్లో అమ్మడు చెమల పిల్లి బ్యూటీని తలపిస్తుంది.
వైట్ అండ్ వైట్ లో శోభిత ఎంతో అందంగా కనిపిస్తుంది. అమ్మడి హెయిర్ స్టైల్..మ్యాకప్....చెవులీలు ప్రతీది ప్రత్యేకంగా ఫోకస్ చేసాయి. రెడ్ కార్పెట్ పై నడిచముందు క్యాప్చర్ చేసిన పిక్ ఇది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. శోభిత అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు గుప్పించి అభిమానం చాటుకుంటున్నారు.