శోభిత రెడ్ బికినీ పాతదే కానీ కొత్తగా
అందుకే ముంబై పరిశ్రమ ఎప్పుడో ఓన్ చేసుకుని ఈ ట్యాలెంట్ ని సద్వినియోగం చేస్తోంది.
By: Tupaki Desk | 20 March 2024 12:30 AM GMTశోభిత ధూలిపాళ ..తనదైన అందం అభినయంతో మత్తు చల్లుతుంది. అత్యుత్తమ ప్రతిభతో రాణిస్తున్న నేటితరం మేటి నటి అని కీర్తిస్తే తప్పేమీ కాదు. శేష్ `గూఢచారి` చిత్రంలో చూసింది చాలా తక్కువ. అంతకుమించి అనేలా వరుస సినిమాల్లో అద్భుత అభినివేశంతో చంపుతోంది ఈ తెలుగమ్మాయి. అందుకే ముంబై పరిశ్రమ ఎప్పుడో ఓన్ చేసుకుని ఈ ట్యాలెంట్ ని సద్వినియోగం చేస్తోంది.
ఒక రకంగా చెప్పాలంటే శోభిత రేంజుకు తగ్గ కథలు దర్శకనిర్మాతలు రెడీ చేయాలే కానీ చించి ఆరేస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అటు హిందీ పరిశ్రమతో పాటు ఇటు దక్షిణాదినా ఈ భామకు ఆఫర్లకు కొదవేమీ లేదు. అదంతా అటుంచితే శోభితకు చెందిన త్రోబ్యాక్ ఫోటో గ్రాఫ్ ఒకటి ఇప్పుడు అంతర్జాలంలో సుడిగాలి వేగంతో దూసుకెళుతోంది.
ఈ ఫోటోగ్రాఫ్ లో శోభిత రెడ్ బికినీ ధరించి కనిపిస్తోంది. బీచ్ ఇసుకలో మోకాళ్లపై కూచుని బ్యాక్ ఫీట్ లో కనిపించింది. శోభిత ఈ లుక్‌లో టూ హాట్‌గా కనిపిస్తోంది. నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్ అంటూ ఇప్పుడు మరోసారి అంతర్జాలంలో కామెంట్లు పడిపోతున్నాయ్. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ వైరల్ గా షేర్ అవుతోంది.
మంకీ మేన్ ప్రమోషన్స్ లో బిజీ:
శోభితా ధూళిపాల నటించిన `మంకీ మ్యాన్` ప్రీమియర్లకు సిద్ధమైంది. ఈ చిత్రంతో ప్రతిభావంతుడైన దేవ్ పటేల్‌తో కలిసి హాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది ఈ బ్యూటీ. ఇటీవల SXSWలో గ్రాండ్‌గా స్పెషల్ షోని ప్లాన్ చేయగా ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కాయి.
లాక్మే ఫ్యాషన్ వీక్ X ఎఫ్‌డిసిఐ సందర్భంగా జరిగిన చాట్‌లో శోభిత హాలీవుడ్ లో ప్రవేశించినందుకు తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. కొత్త పరిశ్రమలో ముఖ్యంగా హాలీవుడ్‌లో పనిచేయడం థ్రిల్లింగ్ అనుభవం. నా పాత్ర ముఖ్యమైనది కానప్పటికీ, దేవ్ పటేల్ దృష్టిలో నేనూ ఒక భాగం కావడం కల నిజం కావడమే! అని తెలిపింది. షో స్క్రీనింగ్ అంతటా నాకు గూస్‌బంప్స్ వచ్చాయి. చీర్స్, చప్పట్లు, నిలబడి ప్రశంసలతో ఇది మరపురాని క్షణం అని తెలిపింది.
మంకీ మ్యాన్ శోభితకు హాలీవుడ్ అరంగేట్రం.. దేవ్ పటేల్ కి దర్శకుడిగా తొలి ప్రయత్నం. స్లమ్‌డాగ్ మిలియనీర్ లో తన అద్భుతమైన నటనతో మెప్పించిన దేవ్ దర్శకుడిగాను నిరూపించుకోవాలనే తపనతో పని చేసాడు. పటేల్, పాల్ అంగునవేలా -జాన్ కొలీ స్క్రీన్ ప్లేను రచించారు.