Begin typing your search above and press return to search.

ఆ సంబ‌రంలో తెలుగు బ్యూటీ ఇలా!

ఇక అమ్మ‌డి మ్యాక‌ప్ ఇత‌ర అలంక‌ర‌ణ ప్రతీది శోభిత‌ను మ‌రింత అందంగా మ‌లిచాయి.

By:  Tupaki Desk   |   14 July 2024 3:30 PM GMT
ఆ  సంబ‌రంలో తెలుగు బ్యూటీ ఇలా!
X

అంబానీ ఇంట సంబ‌రంలో టాలీవుడ్ హాట్ భామ శోభిత ధూళిపాళ కూడా మెరిసింది. ఆ వేడుక కోసం అమ్మ‌డు సంప్రదాయ చీరందంలో త‌ళుక్కున మెరిసింది. క్రీమ్ క‌ల‌ర్ సారీ లో సొగ‌స‌రి ఎంతో అందంగా ముస్తాబైంది. మ్యాచింగ్ యాక్స‌ర‌సీస్ ధ‌రించి మ‌రింత ఆక‌ర్ష‌ణీయ‌త‌ను జోడించింది. ఇక అమ్మ‌డి మ్యాక‌ప్ ఇత‌ర అలంక‌ర‌ణ ప్రతీది శోభిత‌ను మ‌రింత అందంగా మ‌లిచాయి.


ప్ర‌స్తుతం ఆ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అనంత్-రాధిక‌ల‌కు విషెస్ తెలియ‌జేస్తూ కొన్ని గంట‌ల క్రిత‌మే ఈ ఫోటోని పోస్ట్ చేసింది. శోభిత అందానికి యువ‌త ఫిదా అవుతుంది. మునుప‌టి కంటే శోభిత బ్యూటీలో మార్పులొచ్చాయి. రూప లావ‌ణ్యంలో ఆ మార్పులు స్ప‌ష్టంగా గ‌మ‌నించొచ్చు. ఈ పిక్ లో ఆ ఛేంజ్ మ‌రింత స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని నెటి జ‌నులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


ఇక మూడు రోజుల అంబానీ ఇంట వేడుక‌లో భాగంగా రెండు రోజులుగా సెల‌బ్రిటీల ఫోటోలు బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉన్నాయి. పెళ్లికి హాజ‌రు కాని వారు ఆ మ‌రుస‌టి రోజు ఈవెంట్ కి..ఈ రెండింటికి వెళ్ల‌ని వారు ఈరోజు జ‌రిగే వేడుక‌ల‌కు హాజ‌ర‌వుతున్నారు. ఇంకా మ‌రికొన్ని గంట‌ల్లో వేడుక‌ల ముగుస్తాయి. నేడు రిసెప్ష‌న్ డే నేప‌థ్యంలో భారీ ఎత్తున సెల‌బ్రిటీల‌కు పార్టీ ఏర్పాటు చేసారు. మరి ఈవెంట్ కి ఎంత మంది హాజ‌ర‌వుతున్నారో తెలియాలి.


ఇక శోభిత దూళిపాళ స‌క్సెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ టూ హాలీవుడ్ వ‌యా టాలీవుడ్ మీద‌గా దూసుకెళ్లిన బ్యూటీ. ఓ తెలుగు న‌టి ఇంగ్లీష్ సినిమా చేయ‌డం అన్న‌ది నిజంగా ప్ర‌శంసించ‌ద‌గ్గ విష‌యం. ఎంతో మంది తెలుగు భామ‌లున్నా! ఎవ‌రికీ సాధ్యం కానిది శోభిత సాధ్యం చేసి చూపించింది. సినిమా ఛాన్స్ అనేది ఇండియాలో ఎంత క‌ష్ట‌మో అంద‌రికీ తెలిసిందే.