Begin typing your search above and press return to search.

శోభిత కిల్లర్ లుక్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా..

శోభితా ధూళిపాళ.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది

By:  Tupaki Desk   |   11 March 2024 3:19 PM GMT
శోభిత కిల్లర్ లుక్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా..
X

శోభితా ధూళిపాళ.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. 2016లో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన రామన్ రాఘవ్ 2.0తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ. ఆ తర్వాత అడవి శేష్ హీరోగా యాక్ట్ చేసిన మేజర్ సినిమాలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇక కోలీవుడ్ లో పొన్నియన్ సెల్వన్ రెండు పార్టుల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

అయితే శోభిత పలు ఓటీటీ ప్రాజెక్టులతో బాగా ఫేమస్ అయింది. మేడ్ ఇన్ హెవెన్, బర్ద్ ఆఫ్ బ్లడ్, ది నైట్ మేనేజర్ వంటి బాలీవుడ్ వెబ్ సిరీసులతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికే ఓ హాలీవుడ్ సినిమా చేస్తుండగా.. అక్కడ కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి ఈ తెలుగమ్మాయికి. ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తోంది. ట్రెండీ ఔట్ ఫిట్స్ లో అలరిస్తుంటోంది.

తాజాగా శోభిత.. బ్రైడ్స్ టుడే (Brides Today) మ్యాగ్ జైన్ పై దర్శనమిచ్చింది. రెడ్ కలర్ స్టైలిష్ డ్రెస్ లో స్టూల్ పై కూర్చుని సెగలు పుట్టించింది. తన లుక్స్ తో ఒక్కసారిగా నెట్టింట హీటెక్కించింది. ఆమె ధరించిన నెక్ సెట్.. ఆమె అందాన్ని మరింత పెంచింది. మ్యాగ్ జైన్ పై శోభిత పిక్ తోపాటు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని కూడా రాసి ఉంది. అయితే ఈ పిక్ ను బ్రైడ్స్ టుడే తన అఫీషియల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

దాంతోపాటు శోభితను బ్రైడ్స్ టుడే ఆకాశానికెత్తేసింది. "ఆమె తొలి చిత్రం రామన్ రాఘవ్ 2.0కు కేన్స్ నామినేషన్ నుంచి, మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్, PS I & II, ఘోస్ట్ స్టోరీస్... శోభితా ధూళిపాళ కెరీర్ గ్రాఫ్ ఎక్సైటింగ్‌ గా ఉంది. తాను ఓ అద్భుతం కోసం చూస్తున్నానని శోభిత చెప్పింది. ఆడిటోరియాలు ఖాళీగా ఉన్నా లేదా పూర్తిగా రద్దీగా ఉన్నా నేను ఒక పాట పాడే అమ్మాయిని మాత్రమేని తెలిపింది" అంటూ బ్రైడ్స్ టుడే పోస్ట్ చేసింది.

కాగా శోభిత ప్రస్తుతం హాలీవుడ్ సినిమా మంకీ మ్యాన్ తో పాటు సితార అనే బాలీవుడ్ మూవీలో నటిస్తోంది. ఇటీవల ఆమె.. ఓ ఇంటర్వ్యూలో జీవితంలో అమ్మ అవ్వడంతోపాటు అమ్మా అని పిలిపించుకోవడం ఎంతో బాగుంటుందని, అది ఎప్పుడు అనుభవిస్తానోనని అని చెప్పింది. దీంతో ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి చేసుకోనుందని వార్తలు వచ్చాయి. మరి ఇందులో నిజమెంతో చూడాలి.