బన్నీ పాటకు శోభిత మాస్ స్టెప్పులు.. సంతోషం అలా ఉంది మరి!
శ్రద్దా, మేరీ షాదీ హో రహీ హై! (నాకు పెళ్లవుతోంది) అంటూ తన మేకప్ ఆర్టిస్ట్ కు చెబుతూ శోభితా ఉత్సాహంగా మాస్ స్టెప్పులేశారు.
By: Tupaki Desk | 11 Dec 2024 10:30 AM GMTహీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.. రీసెంట్ గా శోభిత అక్కినేనిగా మారిన విషయం తెలిసిందే! డిసెంబర్ 4వ తేదీన హీరో నాగ చైతన్యతో ఆమె వివాహం గ్రాండ్ గా జరిగింది. కొంత కాలంపాటు ప్రేమలో ఉన్న చైతూ, శోభిత.. ఇరు కుటుంబాల అంగీకారంతో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేద మంత్రాల మధ్య ఒక్కటయ్యారు.
అయితే పెళ్లికి ముందు శోభిత సరదాగా డ్యాన్స్ చేశారు. పెళ్లి కూతురిగా ముస్తాబు అయ్యాక.. మేకప్ రూమ్ లో చిందులేశారు. శ్రద్దా, మేరీ షాదీ హో రహీ హై! (నాకు పెళ్లవుతోంది) అంటూ తన మేకప్ ఆర్టిస్ట్ కు చెబుతూ శోభితా ఉత్సాహంగా మాస్ స్టెప్పులేశారు. సరైనోడు సినిమాలోని బ్లాక్ బాస్టర్ సాంగ్ కు డ్యాన్స్ చేశారు.
అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. పెళ్లి బాగా ఎంజాయ్ చేశారుగా అని కామెంట్లు పెడుతున్నారు. మేడమ్.. చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నారని చెబుతున్నారు. సింప్లీ సూపర్బ్ డ్యాన్స్ అక్కినేని కోడల్ అంటూ ప్రశంసిస్తున్నారు.
అయితే మేకప్ ఆర్టిస్ట్ శ్రద్ధ షేర్ చేసిన వీడియోలో శోభితను పెళ్లి కూతురిగా ముస్తాబు చేస్తున్న విజువల్స్ కూడా ఉన్నాయి. పెళ్లి చీరలో శోభిత చాలా అందంగా కనిపిస్తున్నారు. ఒంటి నిండా నగలతో కుందనపు బొమ్మలా ఉన్నారు. పెళ్లి కూతురు గెటప్ లో శోభిత.. చాలా గ్లోరియస్ గా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇక.. ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి చెందిన శోభిత.. బాలీవుడ్ మూవీ రామన్ రాఘవన్ 2.0తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత గూడచారి సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చారు. మాలీవుడ్, హాలీవుడ్ లో కూడా పలు సినిమా అవకాశాలు అందుకుని అందరినీ మెప్పించారు.
2024లో హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్.. బాలీవుడ్ సినిమా లవ్ సితారలో కనిపించారు శోభిత. ఇప్పుడు పలు అవకాశాలు అందుకుంటున్నారు. వాటితో వచ్చే ఏడాది సందడి చేయనున్నారు. మరి పెళ్లి అయిన తర్వాత శోభిత ఎలాంటి సినిమాలు చేస్తారో.. ఎన్ని హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.