Begin typing your search above and press return to search.

వైరల్ పిక్ : శోభిత ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సమంత సందడి!

అందులో శోభిత దేవసేనలా ఉన్నారని అంతా కామెంట్లు పెట్టారు. అడ్వాన్స్ గా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కూడా చెప్పారు. శోభిత కుటుంబం చూడముచ్చటగా ఉందని అన్నారు.

By:  Tupaki Desk   |   1 Dec 2024 5:29 PM GMT
వైరల్ పిక్ : శోభిత ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సమంత సందడి!
X

హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.. మరో మూడు రోజుల్లో అక్కినేని వారి కోడలు కానుంది. యంగ్ హీరో, అక్కినేని వారసుడు నాగ చైతన్యతో ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే చైతూ, శోభిత ఎంగేజ్మెంట్ జరగ్గా.. డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది.

అయితే రీసెంట్ గా వివాహానికి ముందు జరగాల్సిన తంతు శోభిత ఇంట్లో మొదలైంది. సంప్రదాయ పద్ధతిలో రాట వేడుకను ఆమె కుటుంబసభ్యులు నిర్వహించారు. అందులో భాగంగా శోభిత ధూళిపాళ్లకు శుభ సమయాన మంగళ స్నానం చేయించారు. ఈ వేడుకల్లో శోభిత తన కుటుంబ సంప్రదాయ పద్ధతులన్నింటినీ పాటించారు!

తన కుటుంబ సంప్రదాయంగా వస్తున్న ఆభరణాలు ధరించి రెడీ అయ్యారు. అందుకు సంబంధించిన పిక్స్ ను ఆమె ఇప్పటికే సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో శోభిత దేవసేనలా ఉన్నారని అంతా కామెంట్లు పెట్టారు. అడ్వాన్స్ గా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కూడా చెప్పారు. శోభిత కుటుంబం చూడముచ్చటగా ఉందని అన్నారు.

అదే సమయంలో శోభిత పోస్ట్ చేసిన ఓ పిక్.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో సమంత ఆమెకు గంధం పూస్తూ బొట్టు పెడుతూ కనిపించారు. ఎల్లో కలర్ శాలరీ ధరించిన సమంత.. శోభిత మంగళ స్నానాల వేడుకలో సందడి చేశారు. తన క్యూట్ లుక్స్ తో మెప్పించారు. అయితే సమంత అంటే హీరోయిన్ సమంత కాదు.

శోభిత చెల్లెలు పేరు సమంతనే కావడం గమనార్హం. అదే సమయంలో తనకు కాబోయే భర్త మాజీ భార్య పేరు కూడా అదే కావడం యాదృశ్చికం. దీంతో శోభిత, సమంత ఉన్న పిక్స్.. ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి. సిస్టర్స్ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉన్నట్లు కనిపిస్తోందని కూడా సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు.

అయితే 2017లో హీరోయిన్ సమంత, నాగచైతన్య వివాహం కాగా.. 2021లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శోభిత, చైతూ పలుమార్లు కలిసి కనిపించారు. కానీ తాము రిలేషన్ లో ఉన్నామని చెప్పకపోయినా.. లవ్ ట్రాక్ నడుస్తుందని అంతా డిస్కస్ చేసుకున్నారు. కొద్ది నెలల క్రితం ఎంగేజ్మెంట్ అయిందని నాగార్జున సడెన్ గా ప్రకటించారు. ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వనున్నారు.