అల్లు అరవింద్‌కు శోభిత రిక్వెస్ట్.. ఏంటంటే
ఈ గడ్డం వల్ల నా భర్త ముఖాన్ని నేను చూడలేకపోతున్నానని చెప్పిందని, సినిమా రిలీజ్ అయిన నెక్ట్స్ డే నే మీ ఆయన ఫేస్ చూడొచ్చని అరవింద్, శోభితకు చెప్పినట్టు తెలిపాడు.
By: Tupaki Desk | 1 Feb 2025 1:23 PM GMTఅక్కినేని నాగ చైతన్య త్వరలోనే తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పించగా, బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
ఫిబ్రవరి 7న తండేల్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. తాజాగా ముంబైలో తండేల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ చీఫ్ గెస్టుగా విచ్చేసి ట్రైలర్ ను లాంచ్ చేశాడు.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు. నాగ చైతన్యకు కొన్ని రోజుల ముందే పెళ్లైందని, తాను ఆ పెళ్లికి వెళ్లి ఇద్దరినీ ఆశీర్వదించానని, అప్పుడు చైతూ తన భార్యను నాకు పరిచయం చేశాడని, ఆమె సర్ ఒక చిన్న రిక్వెస్ట్ అని అడిగిందని, ఏంటని అడగమంటే నా హస్బెండ్ ఫేస్ ను నాకెప్పుడు చూపిస్తారని అడిగిందని చెప్పాడు.
ఈ గడ్డం వల్ల నా భర్త ముఖాన్ని నేను చూడలేకపోతున్నానని చెప్పిందని, సినిమా రిలీజ్ అయిన నెక్ట్స్ డే నే మీ ఆయన ఫేస్ చూడొచ్చని అరవింద్, శోభితకు చెప్పినట్టు తెలిపాడు. అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తండేల్ సినిమా కోసం చైతన్య ఎంతగా కష్టపడ్డాడో ప్రతీ ఒక్కరికీ తెలుసు.
ఎప్పుడూ లైట్ బియర్డ్ తో స్టైలిష్ లుక్ లో మ్యాన్లీగా ఉండే నాగ చైతన్య తండేల్ కోసం పూర్తిగా జుట్టు, గడ్డం పెంచి రఫ్ లుక్ లోకి మారిపోయాడు. శోభితకు బహుశా చైతూని అలా గడ్డంతో చూడటం నచ్చినట్టు లేదు. అందుకే అరవింద్ కనిపించగానే అలా అడిగేసిందని అక్కినేని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.