పెళ్లికి ముందు శోభిత మరో వివాహం చుట్టూ!
తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ త్వరలో అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 27 Sep 2024 5:18 AM GMTతెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ త్వరలో అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్యని ప్రేమ వివాహం చేసుకుంటుంది. ఇప్పటికే నిశ్చితార్దం ముగించారు. దీంతో ఆ వివాహ తేదీ కోసం ప్రేక్షకాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ పెళ్లికూతురు..పెళ్లి కోడుకు మాత్రం సినిమా షూటింగ్ లు అంటూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శోభిత నటిస్తోన్నసినిమాలు ఆసక్తికరంగా మారాయి.
అమె నటించిన తాజా సినిమా `లవ్ సితార`. వందనా కటారాయా తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ పంజాబీ చెఫ్ తో ప్రేమలో పడిన సితార వివాహం చుట్టూ తిరిగే కథ...చైతన్యని వివాహమాడే ముందు శోభిత సినిమా కూడా వివాహం నేపథ్యం కావడం ఇంట్రెస్టింగ్.
కాగా ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. ఈ సందర్భంగా సినిమా గురించి శోభిత మాట్లాడుతూ...` ఇందులో ప్రతీ పాత్ర కొత్తగా..సవాల్ గా ఉంటుంది. ప్రేమ గొప్ప తనాన్ని తెలిపే సితారపాత్ర పోషించా. ఆమె చాలా తెలివైంది. అన్ని విషయాల్లోనూ సూటిగా నిజాయితీగా ఉంటుంది. ఆమె దైర్యం, సంకల్పం నాకెంతో స్పూర్తినిచ్చాయి. ఈ అంశాల కారణంగా ఆపాత్ర పోషించా. ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎదుర్కోంటున్న సవాళ్లు, కుటుంబ విలువల్నీ ఈ సినిమా తెలియజేస్తుంది` అని అంది.
మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి. శోభితకి నటిగా మంచి గుర్తింపు ఉంది. వైవిథ్యమైన పాత్రలు సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమై ఇమేజ్ ని సంపాదించుకుంది. `మంకీ మ్యాన్` అనే అమెరికన్ చిత్రంలో కూడా నటించింది. అలా హాలీవుడ్ లో కూడా శోభిత ఎంట్రీ ఇచ్చింది.