Begin typing your search above and press return to search.

హాలీవుడ్ ఎంట్రీ పై తెలుగు అమ్మాయి కామెంట్ ఇది!

తాజాగా శోభిత హాలీ వుడ్ లోనూ ఎంట్రీ షురూ చేసిన సంగ‌తి తెలిసిందే. ఏకంగా ఆస్కార్ విజేత చిత్రంలోనూ న‌టించే అరుదైన అవ‌కాశం ఒడిసి ప‌ట్టుకుంది.

By:  Tupaki Desk   |   6 Feb 2024 10:55 AM GMT
హాలీవుడ్ ఎంట్రీ పై  తెలుగు అమ్మాయి కామెంట్ ఇది!
X

తెలుగు అమ్మాయి శోభిత దూళిపాళ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు ఎంట్రీనే బాలీవుడ్ లో జ‌రిగింది. 'రామ‌న్ రాఘ‌వ 2.0'..'చెఫ్' లాంటి సినిమాలో హిందీ ప్రేక్ష‌కుల్ని మెప్పించే ప్ర‌య‌త్నం చేసింది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో టాలీవుడ్ లోనూ లాంచ్ అయింది. స్పై థ్రిల్ల‌ర్ 'గూఢ‌చారి'లో అవ‌కాశం రావ‌డంతో ఇక్క‌డ ఆమె లైఫ్ ఒక్క‌సారిగా కొత్త ట‌ర్నింగ్ తీసుకుంది. తొలి విజ‌యంతోనే బోలెడంత పాపులారిటీ సంపాదించింది.

అమ్మ‌డి పెర్పార్మెన్స్...బ్యూటీ ప్ర‌తిది శోభిత‌ని ప్ర‌త్య‌కంగా హైలైట్ చేసింది. అటుపై మ‌ల‌యాళం..త‌మిళ చిత్రాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆ ర‌కంగా శోభిత పాన్ ఇండియాలో ఓ వైబ్రేష‌న్ గా క‌నిపించింది. ఏ భాష‌ని ప్ర‌త్యేకంగా టార్గెట్ చేయ‌కుండా అన్ని భాష‌లు నావే అంటూ అన్ని ప‌రిశ్ర‌మ ల్లోనూ త‌న‌దైన ముద్ర వేసింది.

ఓన‌టిగా శోభిత జ‌ర్నీ పాన్ ఇండియాలో చాలా వేగంగా పూర్తి చేసిందని చెప్పొచ్చు. తాజాగా శోభిత హాలీ వుడ్ లోనూ ఎంట్రీ షురూ చేసిన సంగ‌తి తెలిసిందే. ఏకంగా ఆస్కార్ విజేత చిత్రంలోనూ న‌టించే అరుదైన అవ‌కాశం ఒడిసి ప‌ట్టుకుంది.

జోర్డాన్ పీలే నేతృత్వంలోని యూనివర్సల్ పిక్చర్స్ ప్రొడక్షన్ పై తెర‌కెక్కుతోన్న 'మంకీ మ్యాన్లో' తో అరంగేట్రం చేస్తోంది. ఈ యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ దేవ్ పటేల్ తెర‌కెక్కిస్తున్నాడు. ఇంకా పేరున్న హాలీవుడ్ న‌టులు న‌టిస్తున్నారు. వాళ్ల‌తో క‌లిసి తెలుగు అమ్మాయి శోభిత కూడా తెర‌ను పంచుకోవ‌డం విశేషం. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలతో మంకీ మ్యాన్ కి మంచి బ‌జ్ క్రియేట్ అయింది. తాజాగా శోభిత సినిమాలోత‌ త‌న పాత్ర గురించి తొలిసారి స్పందించింది.

'ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి పాత్ర‌లో న‌టించ‌లేదు. ఇది నాకెంతో స్పూర్తినిచ్చింది. సినిమాపై నాకెంతో ప్రేమ..గౌర‌వం పెరిగాయి. ఎమోష‌న‌ల్ స్టోరీ అంద‌రికీ న‌చ్చుతుంది. ఛాలెంజింగ్ రోల్స్ చేయ‌డానికి ఎప్పుడు వెన‌క‌డుగు వేయ‌ను. కొత్త క‌థ‌ల‌పై ఆస‌క్తి పెంచుకుంటాను. భిన్న‌మైన క‌థ‌లు వ‌స్తే భాష‌తో సంబంధం లేకుండా న‌టిస్తాను. మంకీ మ్యాన్ పై ఆ న‌మ్మ‌కం క‌ల‌గ‌డంతోనే న‌టిస్తున్నాను' అని తెలిపింది.