శోభిత ఉదయాన్నే సుప్రభాతం చదువుతుందా?
శోభిత ఉదయానే లేచి పూజలు చేస్తుందిట. సుప్రభాతం, సూర్యష్టకం చదువు తుందిట.వీలున్నప్పుడల్లా తప్పకుండా ఆలయాలు సందర్శిస్తుందిట. అలాగే బయట పుడ్ తినదట.
By: Tupaki Desk | 10 Aug 2024 10:30 AM GMTయువ సామ్రాట్ నాగచైతన్య-శోభిత ధూళిపాళ వివాహ బంధంతో ఒకటవుతోన్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ధాంపత్య జీవితంలోకి అడుగుపెడుతుంది. ఇప్పటికే నిశ్చితార్దం పూర్తయింది. ఇక శోభిత తెలుగు అమ్మాయి కావడం మరింత ఆసక్తికరమైన విషయం. తెనాలిలో పుట్టినా.. పెరగడం..చదువుకోవడం అంతా వైజాగ్ లోనే. ఈ నేపథ్యంలో శోభిత గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఆమె తండ్రి వేణుగోపాల్ రావ్ మర్చంట్ నేవీలో పనిచేసారు. దీంతో ఆమె వైజాగ్ తో ఆమె బంధం వీడదీయరానిది. అలాగే తల్లి టీచర్. శోభితకి తెలుగు సంప్రదాయాలన్ని ఎంతో చక్కగా అలవాట య్యాయి. శోభిత ఉదయానే లేచి పూజలు చేస్తుందిట. సుప్రభాతం, సూర్యష్టకం చదువు తుందిట.వీలున్నప్పుడల్లా తప్పకుండా ఆలయాలు సందర్శిస్తుందిట. అలాగే బయట పుడ్ తినదట.
ఇంటిపుడ్ మాత్రమే తీసుకుంటుందిట. తన వంట తానే స్వయంగా చేసుకుంటుందిట. అలాగే ఆమె పూర్తిగా శాఖాహారి. ఇంటి పనులన్నింటిని తానే స్వయంగా చేసుకుంటుందిట. చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు కావడంతో ఇప్పటికీ అలాగే కొనసాగిస్తుందిట. మధ్య తరగతి కుటంబం కావడంతో ఇవన్నీ చిన్న వయసులోనే అలవాటయ్యాయంది. అలాగే నవలలు, హారీపోటర పుస్తకాలు బాగా చదువుందిట. భరతనాట్యం, గిటార్ వాయిస్తుందిట.
శోభితలో చైతన్యకి ఈలక్షణాలన్ని ఎంతో నచ్చాయట. ఆమెకి దగ్గరవ్వడానికి ఇవి ప్రధాన కారణాలుగా నెట్టింట వైరల్ అవుతోంది. నాగచైతన్య తొలి వివాహం నటి సమంతతో జరిగిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల కాపురం అనంతరం మనస్పర్దలు చోటు చేసుకోవడంతో విడిపోయారు.