తెలుగమ్మాయి హాలీవుడ్ డెబ్యూ పరిస్థితి ఏంటి?
స్టార్ క్యాస్టింగ్ మధ్య శోభిత పాత్ర కిల్ అయిందంటున్నారు. ఇందులో శోభిత కాల్ గాళ్ పాత్ర పెద్దగా కనెక్ట్ అవ్వలేదని వినిపిస్తోంది.
By: Tupaki Desk | 26 April 2024 9:51 AM GMTతెలుగమ్మాయి శోభిత ధూళిపాళ నేరుగా బాలీవుడ్ లో సినిమాలు చేసి ఫేమస్ అయిన వైనం తెలిసిందే. బేసిక్ గా సినిమా ఛాన్స్ అంటేనే ఎంతో కష్టమైన పని. అందులోనూ తెలుగు వాళ్లకు అవకాశాలివ్వడం అంటే ఇంకా గగనం. కానీ శోభిత మాత్రం ఆ రెండింటిని దిగ్విజయంగా చేధించింది. ట్యాలెంట్ ఉంటే? అవకాశాలు ఎందుకు రావని బాలీవుడ్ లో సక్సెస్ అయి ప్రూవ్ చేసింది. అక్కడ నుంచి టాలీవుడ్ కొచ్చి సినిమాలు చేసిన బ్యూటీ శోభిత. అందుకే అమ్మడు ఎప్పటికీ సంథింగ్ స్పెషల్.
ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ లోనో 'మంకీ మ్యాన్' అనే సినిమాతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ లో అవకాశం రావడమే ఎంతో సాహసంతో కూడుకున్న పనిని కూడా సాధ్యం చేసి చూపించింది. ఆ రకంగ మరోసారి శోభితని ప్రశంసించాల్సిందే. ప్రియాంక చోప్రా...దీపికా పదుకొణే..ఐశ్వర్యారాయ్ లాంటి పేరున్న భామలకే సాధ్యమైన పనిని తెలుగమ్మాయి అమెరికా వెళ్లి మరీ సుసాధ్యం చేసుకొచ్చింది. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంది? శోభిత కెరీర్ కి మంకీ మ్యాన్ ఎంతవరకూ ప్లస్ అవుతుందంటే? వివరాల్లోకి వెళ్లాల్సిందే.
'మంకీ మ్యాన్' ఇప్పటికే కొన్ని విదేశాల్లో రిలీజ్ అయింది. కెనడా..అమెరికా లాంటి దేశాల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి టాక్ ఏంటి? అంటే శోభితపై రిపోర్ట్ నెగిటివ్ గానే వినిపిస్తోంది. ఇందులో శోభిత పాత్ర చాలా చిన్నదనే విమర్శ తెరపైకి వస్తోంది.
స్టార్ క్యాస్టింగ్ మధ్య శోభిత పాత్ర కిల్ అయిందంటున్నారు. ఇందులో శోభిత కాల్ గాళ్ పాత్ర పెద్దగా కనెక్ట్ అవ్వలేదని వినిపిస్తోంది. ఆమె పాత్ర కొన్ని డైలాగ్‌లు ,సన్నివేశాలకే పరిమితమైందని టాక్ వినిపిస్తుంది.
చిత్ర కథానాయకుడు దేవ్ పటేల్‌తో ఆమె పాత్ర పెద్దగా లేదంటున్నారు. అతడితో శోభిత రొమాన్స్ అనే టాపిక్ ఎక్కడా ఉండదట. ఇది చాలా మంది అభిమానుల్ని నిరుత్సాహ పరిచినట్లు రిప్టోర్ట్ వస్తోంది. మొత్తం సినిమా రిపోర్ట్ చూస్తే మిక్సుడు టాక్ వస్తోంది. కొంత మంది బాగుందంటే..మరికొంత మంది తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కల్పిత కథలో పాత్రల్ని బలంగా చూపించడంలో దర్శకుడు విఫలమైనట్లు చెబుతున్నారు. మరి ఈ సినిమా భారతీయులకు కనెక్ట్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి. ఈ సినిమా ఇక్కడ రిలీజ్ అవ్వడానికి ఇంకా కొన్ని నెలలు సమయం పడుతుందంటున్నారు.