Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : డిఫరెంట్‌ ఔట్ ఫిట్‌లో అందాల 'గూఢచారి'

తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందమైన ఔట్‌ ఫిట్ తో మరింత అందంగా కనిపిస్తూ నెటిజన్స్ కు వీనుల విందు అన్నట్లుగా నిలిచింది అనడంలో సందేహం లేదు.

By:  Tupaki Desk   |   28 Dec 2023 9:51 AM GMT
పిక్ టాక్ : డిఫరెంట్‌ ఔట్ ఫిట్‌లో అందాల గూఢచారి
X

2013 లో జరిగిన మిస్ ఎర్త్‌ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరపున పాల్గొన్న అందాల శోభితా ధూళిపాళ్ల అదే ఏడాది జరిగిన మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన విషయం తెల్సిందే. తెలుగు అమ్మాయి, తెనాలి అమ్మాయి అయిన శోభిత టాలీవుడ్‌ లో ప్రయత్నించకుండా ముంబై వెళ్లి మోడలింగ్ పై ఆసక్తి కనబర్చింది.


మోడల్ గా బాలీవుడ్ ఫిల్మ్‌ మేకర్స్ దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు లో అడవి శేష్‌ కు జోడీగా గూఢచారి సినిమాలో నటించడం ద్వారా మంచి గుర్తింపును దక్కించుకుంది. హీరోయిన్‌ గా బాలీవుడ్ లో తన జోరు కంటిన్యూ చేస్తోంది. వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా అందంతో అలరిస్తూ ఉంది.


ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు డిఫరెంట్‌ ఔట్‌ ఫిట్ లో ఈ అమ్మడు తన ఫాలోవర్స్ కి మరియు ఫ్యాన్స్ కి కన్నుల విందు చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందమైన ఔట్‌ ఫిట్ తో మరింత అందంగా కనిపిస్తూ నెటిజన్స్ కు వీనుల విందు అన్నట్లుగా నిలిచింది అనడంలో సందేహం లేదు.


ఆ మధ్య ఒక టాలీవుడ్‌ హీరోతో ఈమె ప్రేమలో ఉంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇరు వైపుల నుంచి అలాంటిది ఏమీ లేదు అంటూ క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పటికి కూడా కొన్ని ఫోటోలు మరియు వీడియోలను నెటిజన్స్ చూపించి ఆ హీరోతో శోభిత ప్రేమలో ఉందని గట్టిగా వాదిస్తున్నారు. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.