ముంబైని ఇబ్బందిపెడుతోన్న రీల్స్ రాణీలు!
ఇటీవలే ఓ మహిళ ముంబై మెట్రోలో సినిమాలో ఐటం గాళ్ మాదిరి దుస్తులు.. మ్యాకప్ ధరించి రీల్స్ చేసింది.
By: Tupaki Desk | 31 May 2024 6:02 AM GMTసోషల్ మీడియాని వాడుకున్నోళ్లకు వాడుకున్నంత. ఎంత తెలివిగా వాడుకుంటే అంత సంపాదన అన్నట్లే. ఇన్ స్టా..ఫేస్ బుక్..ట్విటర్..యూ ట్యూబ్ వంటిడిజిటల్ మాధ్యమాల ద్వారా వందతో మొదలైన సంపాదన ఎన్నికోట్లకైనా సంపాదించుకునే అవకాశం ఉంది. ఆఫీస్ లో రోజంతా ఉద్యోగం చేస్తే ఎంతొస్తుంది! అదే ఒక్కరీల్ చేసి నెట్టింట వదిలి చూడు. వైరల్ అయితే! వేలల్లో..లక్షల్లో ఆదాయమే. ప్రస్తుతం భారతదేశ యువత సోషల్ మీడియాని ఏ రేంజ్ లో వినియోగిస్తుందో చెప్పాల్సిన పనిలేదు.
వయసుతో సంబంధం లేకుండా అంతా రీల్స్ చేసి సంపాదిస్తున్నారు. అందులోనూ మహిళలు చేసే వీడియోలకు అయితే మరింత డిమాండ్ కనిపిస్తుంది. కాస్త బోల్డ్ కంటెంట్ ఉందంటే? క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఇప్పుడిదే వాణిజ్య రాజధాని ముంబై సిటీకి ఇబ్బందిగా మారింది. రీల్స్ చేసే సంఖ్య పెరగడంతో? ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా...ఎలాంటి దుస్తులు ధరించాం? ఎలాంటి సమాజంలో ఉన్నామనే అనే సంగతి పక్కనబెట్టి వైరల్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.
మెట్రో రైల్వేస్టేషన్ లో ...కదులుతో న్న ట్రైన్ లో చిట్టిపొట్టి దుస్తులు ధరించి కొంత మంది మహిళలు చేస్తోన్న పనులకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రైన్ లోనే కాదు..పబ్లిక్ ఎ క్కడ ఎక్కువగా అంటే? విచ్చల విడిగా వీడియోలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్లపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ముంబై పీఎస్ ల్లో ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఇటీవలే ఓ మహిళ ముంబై మెట్రోలో సినిమాలో ఐటం గాళ్ మాదిరి దుస్తులు.. మ్యాకప్ ధరించి రీల్స్ చేసింది.
చుట్టూ ఉన్న మగవారిని సైతం పట్టించుకోకుండా వాళ్ల మీద మీదకు వెళ్తూ మరి డాన్సులు చేసింది. దీంతో ఈ రీల్ పై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఇలాంటి మహిళలపై పోలీసులు చర్యలు తీసుకోరా? మహిళలకు స్వేచ్ఛ ఉందని వదిలేస్తారా? అని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇలాంటి రీల్స్ కి సంబంధించి ప్రత్యేకంగా ఓ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.