Begin typing your search above and press return to search.

నానితో సినిమా.. లాభాలే లాభాలు!

అయితే నాని సినిమా అంటే చాలు.. సినీ ప్రియులు మినిమమ్ హిట్ అని ఫిక్స్ అయిపోతారు.

By:  Tupaki Desk   |   18 Jun 2024 5:46 AM GMT
నానితో సినిమా.. లాభాలే లాభాలు!
X

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో నాని.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వరుస సినిమాల్లో నటిస్తూ తనదైన శైలిలో అలరిస్తున్నారు. గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో సందడి చేసిన నాని.. ఇప్పుడు మూడు నాలుగు ప్రాజెక్టులను లైన్ లో పెట్టేశారు. ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఆ మూవీతో సందడి చేయనున్నారు.

అయితే నాని సినిమా అంటే చాలు.. సినీ ప్రియులు మినిమమ్ హిట్ అని ఫిక్స్ అయిపోతారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో నానికి వేరే లెవెల్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. దర్శకుడు ఎవరైనా.. తనలోని టాలెంట్ ను అంతా బయట పెట్టేస్తారు నాని. డైరెక్టర్ సీన్ చెప్పడం లేటు.. నాని జీవించేస్తారనే టాక్ ఉంది. డైరెక్టర్ హీరో అని ఆయనను అంటారు. నాని సినిమాలకు నష్టాలు కూడా రావని చెబుతుంటారు.

ఇక టాలీవుడ్ లో మిగతా హీరోలతో పోలిస్తే.. నాని సినిమాలకు థియేట్రికల్ తోపాటు నాన్ థియేట్రికల్ బిజినెస్ లు బాగానే జరుగుతాయి. మేకర్స్ కు మంచి లాభాలు వస్తుంటాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో అన్ని రకాల బిజినెస్ లు పక్కాగా ఉన్న హీరో నాని అనే చెప్పాలి. దీంతో చాలా మంది నిర్మాతలు నానితో సినిమాలు చేయాలని ట్రై చేస్తుంటారు. బడ్జెట్ ను కాస్త కంట్రోల్ లో పెట్టుకుంటే మంచి లాభాలను పొందాలని చూస్తుంటారు.

అయితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఒకరు.. నానితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నానితో ఓ మూవీ చేయగా.. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు గాను.. నాని తో కాంటాక్ట్ లోనే ఉన్నారు. రెండు మూడు రోజులకు ఓసారి నానితో డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇంకా నాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఇప్పట్లో ఫిక్స్ అయినట్లు కూడా లేదు.

ఆయనతోపాటు మరో యంగ్ ప్రొడ్యూసర్ కూడా నానితో మూవీ తీయాలని తహతహలాడుతున్నారు. మరో ఇద్దరు ముగ్గురు కూడా నానితో వర్క్ చేసేందుకు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ నాని.. మాత్రం ఇంకా ఎవరికీ ఛాన్స్ ఇవ్వలేదు. అందరితో మంచి రిలేషన్ మాత్రం మెయింటైన్ చేస్తున్నారు. సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరి నాని లైనప్ లో ఉన్న వారు కాకుండా.. మిగతా ఎవరితో వర్క్ చేస్తారో చూడాలి.