Begin typing your search above and press return to search.

సుకుమార్ ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు..!

ఐతే పుష్ప 2 సినిమా ఓవరాల్ గా బాగానే ఉన్నా పార్ట్ 2 లో కథ మాత్రం అసలు ఏమి లేదని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   5 Dec 2024 9:58 AM GMT
సుకుమార్ ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు..!
X

అల్లు అర్జున్ తో పుష్ప 1 కి సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న నైటే ప్రీమియర్స్ మొదలవగా అప్పటి నుంచి సినిమాపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. పుష్ప 2 సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా అంతా కూడా పుష్ప రాజ్ అదే మన అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అదిరిపోయింది. సినిమా కోసం అల్లు అర్జున్ పడిన కష్టమంతా తెర మీద కనిపిస్తుంది. పుష్ప రాజ్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ అందించింది.

ఐతే పుష్ప 2 సినిమా ఓవరాల్ గా బాగానే ఉన్నా పార్ట్ 2 లో కథ మాత్రం అసలు ఏమి లేదని చెప్పొచ్చు. ఎస్పీ భన్వర్ సింగ్ తో వైరం ఓ వైపు చూపించి దాదాపు వారిద్దరి మధ్య గొడవని చివరి ఆకా చూపించారు. ఐతే పుష్ప 2 సినిమా గ్లింప్స్ గా లాస్ట్ ఇయర్ ఒక వీడియో వదిలారు. అందులో పుష్ప రాజ్ పారిపోతాడు పోలీసులు అతని ఆచూకి తెలుసుకోవాలని చూస్తారు. పుష్ప రాజ్ అడవిలో ఉన్నట్టు ఒక వీడియో దొరుకుతుంది.పుష్ప రాజ్ కోసం ప్రజలంతా ఆందోళన చేస్తుంటారు.

పుష్ప 2 గ్లింప్స్ గా వదిలిన ఆ సీన్స్ ఏవి సినిమాలో లేవు. అంటే పార్ట్ 3 కోసం దాచి పెట్టినట్టు ఉన్నారు. అసలే పుష్ప 2 సినిమాను సుకుమార్ కథ మీద కన్నా పుష్ప రాజ్ ఎలివేషన్స్ మీద ఎక్కువ గురి పెట్టాడు. పార్ట్ 2 లో అల్లు అర్జున్ అడివిలోకి పారిపోతుందే అనుకుంటున్నారు. లెంగ్త్ ఎలాగు ఉంది కాబట్టి ఆ సీస్ ఇందులోనే పెడితే బాగుందేవి అని అంటున్నారు.

పార్ట్ 3కి కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ఉండేలా పుష్ప 2 కోసం తీసిన రష్ ని పార్ట్ 3కి దాచి పెట్టుకున్నాడు. పార్ట్ 3లో కూడా బన్నీ విశ్వరూపం ఉంటుందని చెప్పవచ్చు. పుష్ప 2లోనే అసలు కథ ఏది లేదని అందరు అనుకుంటున్నారు మళ్లీ అలాంటిది పుష్ప 3 ఎందుకని కొందరి మాట . ఐతే ఏమైనా కూడా పుష్ప 2 కి టాక్ ఒక రేంజ్ లో వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగాయి కాబట్టి ఫస్ట్ డే కలెక్షన్స్ అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు.