స్టార్ హీరోతో అపార్ట్‌మెంట్‌లో దొరికి నటి!
బాలీవుడ్ అగ్ర కథానాయకుల సరసన నటించిన మేటి కథానాయిక సోమీ అలీ, సల్మాన్ ఖాన్‌తో తనకున్న అనుబంధం గురించి.. బ్రేకప్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
By: Tupaki Desk | 4 Oct 2023 4:14 AM GMTబాలీవుడ్ అగ్ర కథానాయకుల సరసన నటించిన మేటి కథానాయిక సోమీ అలీ, సల్మాన్ ఖాన్‌తో తనకున్న అనుబంధం గురించి.. బ్రేకప్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సల్మాన్ తో సంబంధంలో ఉన్న సమయంలో తాను ఎదుర్కొన్న సమస్యలపైనా ఓపెనైంది. సీనియర్ నటి సోమీ .. సల్మాన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న సంగీతా బిజ్లానీని మోసం చేశాడని తెలిపింది. సంగీత అతడిని పెళ్లాడాలనుకుంది. కానీ సల్మాన్ పెళ్లి వద్దనుకున్నాడు. దాంతో నా సహాయం తీసుకున్నాడు. హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు! అని తెలిపింది.
బంధంలో ఉన్న సమయంలోనే సల్మాన్ ఖాన్ తనను కూడా మోసం చేశాడని సోమీ అలీ వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో సోమీ అలీ మాట్లాడుతూ -"వెడ్డింగ్ కార్డ్‌లు ప్రింట్ అయ్యాయి. కానీ సంగీత నా అపార్ట్ మెంట్లో నాతో ఉన్న సల్మాన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. సంగీతకు సల్మాన్ ఏం చేశాడో, నాకూ అదే జరిగింది. దీన్నే కర్మ అంటారు. నేను కొంచెం పెద్దయ్యాక దాని గురించి అర్థం చేసుకున్నాను" అని సోమీ వ్యాఖ్యానించింది. సల్మాన్ ఖాన్ సంగీత బిజ్లానీని 90లలో వివాహం చేసుకోవలసి ఉంది. అప్పటికే ఆమెతో సల్మాన్ కి నిశ్చితార్థం జరిగింది. కానీ పెళ్లి ఇష్టం లేక సల్మాన్ కావాలనే వేరొక మహిళతో పట్టుబడ్డాడు.
తాను సల్మాన్ అభిమానిగా బాలీవుడ్‌లోకి ఎలా ప్రవేశించిందో అతడి విషయంలో తాను ఎంతగా ఎగ్జయిట్ అయ్యేదో సోమీ అలీ వెల్లడించారు. సల్మాన్ తమ సంబంధాన్ని బహిరంగపరచడానికి ఆసక్తి చూపలేదని ప్రజల దృష్టిలో కేవలం శృంగార సంబంధంగానే ఇది కనిపించిందని, అయితే తాము ఎనిమిదేళ్లు కలిసి ఉన్నామని సోమీ అలీ వెల్లడించింది.
అంతేకాకుండా ఒక ఈవెంట్ సమయంలో తన జుట్టుపై శీతల పానీయం పోయడంతో పాటు, అనేక సందర్భాల్లో బహిరంగంగా తనను సల్మాన్ ఎలా కించపరిచి, అవమానించాడో కూడా తెలిసింది. సల్మాన్ ఖాన్ తో ప్రేమలో ఉన్న ఐశ్వర్యారాయ్ సైతం తనను సల్మాన్ వేధించాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఎంత మంచి హృదయం కలవాడో , అంతగా ప్రేమికురాళ్ల విషయంలో చెడ్డ పేరు తెచ్చుకోవడంపై హిందీ మీడియాలో బోలెడంత చర్చ సాగింది.