అది కచ్ఛితంగా హత్యే.. యంగ్ హీరో మరణంపై నటి వ్యాఖ్య
సోషల్ మీడియాల వేదికగా ప్రముఖ నటి తన సహచరుడైన స్టార్ హీరోపై చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగ మారాయి.
By: Tupaki Desk | 5 Nov 2024 10:19 AM GMTసోషల్ మీడియాల వేదికగా ప్రముఖ నటి తన సహచరుడైన స్టార్ హీరోపై చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగ మారాయి. సదరు భామ సినీపరిశ్రమలో దిగ్గజ నటుడితో తాను ఎఫైర్ నడిపించానని బహిరంగంగా అంగీకరంచడమే గాక, అతడు తనను చంపేస్తానని బెదిరిస్తున్న గ్యాంగ్ స్టర్ కంటే ప్రమాదకారి! అని వ్యాఖ్యానించడం సంచలనం అయింది. అంతేకాదు తాజా ఇంటర్వ్యూలో యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని మర్డర్ చేసారని సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యానించింది. సుశాంత్ సింగ్ మిస్టీరియస్ డెత్ ఇంకా కోర్టులో ఉండగానే, ప్రస్తుతం ఈ కామెంట్ నెటిజనుల్లో తీవ్రమైన చర్చకు తెర తీసింది.
ఇంతకీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలతో వేడెక్కిస్తున్న సదరు నటీమణి ఎవరు? అంటే సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమి అలీఖాన్. సోమీ తాజాగా Redditలో `ఆస్క్ మీ ఎనీథింగ్ (AMA)` సెషన్‌లో బాలీవుడ్ గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హత్యకు గురయ్యారని సోమీ అలీ పేర్కొంది. అతడి శవపరీక్ష నివేదికలో ఆత్మహత్యతో మరణించాడని నిర్ధారించారు. కానీ అతడిని హత్య చేసి, ఆత్మహత్యగా మార్చారు.. తన శవపరీక్ష నివేదికను మార్చిన AIIMS డాక్టర్ సుధీర్ గుప్తాను అడగండి. ఎందుకు అలా చేసారో`` అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సోమీ అలీ స్పందనకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలలో హల్ చల్ చేస్తున్నాయి.
ఎప్పుడో జరిగిన వాటి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు? ఇది ఏమి న్యాయం? అని ఒకరు ప్రశ్నించగా, దీనికి నటి సోమీ అలీ మాట్లాడుతూ.. SSR, జియా ఖాన్ ఇతరులకు న్యాయం కావాలి. రవీంద్ర పాటిల్ ఎలా ఉన్నారు? అతనికి ఏం జరిగింది? అని గూగుల్ చేయండి... అని సోమీ అన్నారు.
2020 అక్టోబర్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో AIIMS మెడికల్ బోర్డు హత్య జరిగిందనే విషయాన్ని తోసిపుచ్చింది. ఉరి లేదా ఆత్మహత్యతో మరణించిన కేసు ఇది అని పేర్కొంది. తాజా కథనాల ప్రకారం.. ఆరుగురు సభ్యుల ఫోరెన్సిక్ వైద్యుల బృందం తయారు చేసిన రిపోర్టులో ``విషం ఇచ్చి గొంతు పిసికి చంపారు`` అనే ఆరోపణలను తోసిపుచ్చింది.
నటుడి మృతి కేసులో ఏర్పాటైన ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ గుప్తా ఉరివేసుకోవడం తప్ప శరీరంపై ఎలాంటి గాయాలు లేవని నివేదించారు. మరణించిన వ్యక్తి శరీరం, బట్టలపై పోరాటం లేదా కొట్లాట గుర్తులు లేవు. ఇది ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కేసు అని ఆయన తెలిపారు. సుశాంత్ సింగ్ తన బాంద్రా అపార్ట్‌మెంట్‌లోని బెడ్‌రూమ్‌లో 14 జూన్ 2020న ఉరి వేసుకుని కనిపించాడు.