Begin typing your search above and press return to search.

సీక్రెట్ డేటింగ్ వెన‌క కార‌ణం చెప్పిన న‌టి

మ‌న గురించి అన్నీ బ‌య‌ట‌కు తెలుసు కాబట్టి.. కొన్ని విషయాలు అయినా మ‌న‌ కోసం దాచుకోవాలని సోనాక్షి అభిప్రాయ‌ప‌డింది.

By:  Tupaki Desk   |   28 Sep 2024 10:30 AM GMT
సీక్రెట్ డేటింగ్ వెన‌క కార‌ణం చెప్పిన న‌టి
X

సోనాక్షి సిన్హా- జహీర్ ఇక్బాల్ 23 జూన్ 2024న వివాహం చేసుకున్నారు. ఈ జంట పెళ్లికి ముందు ఏడేళ్ల పాటు డేటింగ్ చేస్తూ తమ సంబంధాన్ని ప్రైవేట్‌గా ఉంచారు. ఇటీవల సోనాక్షి తాను అలా చేయ‌డం వెనుక ఉన్న కారణాన్ని వెల్ల‌డించింది. ఇది చెడు కన్ను(నాజ‌ర్) నుండి తప్పించుకునే ప్ర‌య‌త్నం అని తెలిపింది. మ‌న గురించి అన్నీ బ‌య‌ట‌కు తెలుసు కాబట్టి.. కొన్ని విషయాలు అయినా మ‌న‌ కోసం దాచుకోవాలని సోనాక్షి అభిప్రాయ‌ప‌డింది.


ఈ అంద‌మైన జంట‌ తమ సంబంధం గురించి బహిరంగంగా చర్చించకపోవడానికి ప్రత్యేక కారణం ఉందా? అని జాతీయ మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు సోనాక్షి పైవిధంగా స్పందించింది. న‌ట‌వార‌సురాలిని గ‌నుక నాపై అంద‌రి క‌ళ్లు ఉంటాయి. ముఖ్యంగా మీడియా క‌న్ను. అందువల్ల ప్రైవేట్ విషయాలు గోప్యంగా ఉంచడం మంచిదని భావించిన‌ట్టు సోనాక్షి తెలిపింది. ``మ‌నం ఇప్పటికే చాలా లైమ్‌లైట్‌లో ఉన్నాం. మ‌న‌ గురించి అందరికీ తెలుసు. అందుకే మ‌న‌కు చాలా ఇష్టమైన దానిని మ‌న కోసం ఉంచుకోవాలి`` అని సోనాక్షి అంది.


సోనాక్షి సిన్హా - జహీర్ ఇక్బాల్ జూన్‌లో వారి ఇంట్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వారి సన్నిహిత స్నేహితులు కుటుంబ సభ్యుల స‌మ‌క్షంలో ఈ పెళ్లి జ‌రిగింది. అధికారికంగా వివాహం గురించి ప్ర‌క‌టించేందుకు సోషల్ మీడియాల్ని ఆశ్ర‌యించారు. 23.06.2024న ఈ జంట వివాహం జ‌రిగింది. సోనాక్షి- జహీర్ వివాహ వేడుక రోజునే రిసెప్షన్ జరిగింది. సల్మాన్ ఖాన్, కాజోల్, రేఖ, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజయ్ లీలా భన్సాలీ త‌దిత‌ర‌ బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.