Begin typing your search above and press return to search.

దేవుడు న‌న్నెందుకిలా పుట్టించాడ‌ని బాధ‌ప‌డ్డా!

ఫిట్ నెస్ విష‌యంలో హీరోయిన్లు ఎంత కేర్ ఫుల్ గా ఉంటార‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   28 Feb 2025 3:00 AM IST
దేవుడు న‌న్నెందుకిలా పుట్టించాడ‌ని బాధ‌ప‌డ్డా!
X

ఫిట్ నెస్ విష‌యంలో హీరోయిన్లు ఎంత కేర్ ఫుల్ గా ఉంటార‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. గ్లామ‌ర్ ఫీల్డ్ లో గ్లామ‌ర్గా క‌నిపించ‌క‌పోతే అవ‌కాశాలు రావ‌న్న‌ది అంద‌రికీ తెలిసిన వాస్త‌వం. అందుకే హీరోయిన్లు అంతా జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు..యోగాలంటూ రోజులో కొంత స‌మ‌యాన్ని క‌చ్చితంగా కేటాయిస్తారు.షేప్ ఔట్ అయిపోతే ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు అలాంటి భామ‌ల‌వైపు చూసే ప‌రిస్థితి ఉండ‌దు.

తాజాగా ఇలాంటి అనుభ‌వాన్ని ఓసారి ఫేస్ చేసానంటూ బాలీవుడ్ న‌టి సోనాక్షి సిన్హా రివీల్ చేసింది. లావుగా ఉన్న కార‌ణంగా ఓ డైరెక్ట‌ర్ హీరోయిన్ గా ప‌నికి రావు అని రిజెక్ట్ చేసాడుట‌. ఆ స‌మ‌యంలో తాను ఎలా ఉన్నాను? అన్న‌ది త‌న‌కు తెలియ‌ద‌ని..కానీ డైరెక్ట‌ర్ అలా అనే స‌రికి మ‌న‌సు ముక్క‌లైంద‌ని వాపోయింది. ఆ మాట అన‌గానే ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయిందిట‌. ఆ స‌మ‌యంలో అత్త ఇంటి ద‌గ్గ‌రే ఉందిట‌.

వెంట‌నే ఆమె ఒడిలో త‌ల పెట్టుకుని క‌ళ్లు బొబ్బ‌లు క‌ట్టేలా ఏడ్చిందిట‌. ఇలాంటి దేహాన్ని ఎందుకిచ్చావ్ అని ఆ దేవుడ‌ని కూడా మ‌న‌సులో తిట్టుకుందిట‌. ఆ సంఘ‌ట‌న నుంచి బ‌ట‌య ప‌డ‌టానికి కొన్ని రోజులు ప‌ట్టింద‌ని తెలిపింది. సోనాక్షి సిన్హా స్టార్ కిడ్ అన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ న‌టుడు శ‌త్రుజ్ఞ సిన్హా కుమార్తెగా ఎంట్రీ ఇచ్చింది. `ద‌బాంగ్` తో లాంచ్ అయిన బ్యూటీ చాలా సినిమాల్లో హీరోయిన్ గా న‌టించింది.

కోలీవుడ్ లో `లింగ` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ త‌ర్వాత అక్క‌డ కొన‌సాగ‌లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే న‌టిగా కొన‌సాగుతుంది. చివ‌రిగా `కాకుడా` చిత్రంలో న‌టిందింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ కొత్త సినిమా అప్ డేట్ ఇవ్వ‌లేదు. అలాగే అమ్మ‌డు గ‌త ఏడాది రైట‌ర్ జ‌హీర్ ఇక్బాల్ తో ధాంప‌త్య జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే.