Begin typing your search above and press return to search.

ఇంట్లో రాత్రి పూట క‌ర్ఫ్యూ విధించారన్న న‌టి

తాను ఇంటి నుంచి త‌ప్పించుకుని వెళ్లాను అంటే.. అది కేవ‌లం త‌న ప్రియుడిని క‌లుసుకునేందుకు మాత్ర‌మేన‌ని తెలిపారు.

By:  Tupaki Desk   |   2 March 2025 9:21 AM IST
ఇంట్లో రాత్రి పూట క‌ర్ఫ్యూ విధించారన్న న‌టి
X

ఒక వ‌య‌సు వ‌చ్చాక అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా స్వేచ్ఛ కోరుకుంటారు. త‌మ‌కు న‌చ్చిన లేదా ప్రేమించిన యువ‌తి లేదా యువ‌కుడిని పెళ్లాడాల‌ని కూడా క‌లలు కంటారు. అయితే త‌న‌కు 30 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చాక కూడా రాత్రి వేళ త‌నపై త‌ల్లిదండ్రులు క‌ర్ఫ్యూ విధించేవార‌ని సోనాక్షి సిన్హా తెలిపింది. త‌న‌పై ఇంట్లో క‌ఠిన‌మైన ఆంక్ష‌లు ఉండేవ‌ని వెల్ల‌డించారు. తన తల్లి పూనమ్ సిన్హా అర్థరాత్రి త‌న‌ను నిశితంగా గ‌మ‌నించేవార‌ని, కానీ తాను ఏదోలా దొంగ‌చాటుగా త‌ప్పించుకునేదానిని అని కూడా సోనాక్షి వెల్ల‌డించారు. తాను ఇంటి నుంచి త‌ప్పించుకుని వెళ్లాను అంటే.. అది కేవ‌లం త‌న ప్రియుడిని క‌లుసుకునేందుకు మాత్ర‌మేన‌ని తెలిపారు.

నేను వృత్తి రీత్యా షూటింగ్ ల‌కు వెళ్లే స‌మ‌యంలో కూడా తెల్లవారుజామున 1:30 గంటలకు ఇంట్లో కర్ఫ్యూ విధించారని సోనాక్షి సిన్హా అన్నారు. నాకు 32 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చే వరకు ఈ ప‌రిస్థితి ఇలాగే ఉండేది. జహీర్‌కు ఇది అతిపెద్ద సమస్యగా ఉండేది. నేను కర్ఫ్యూను ఉల్లంఘించానంటే.. అది అతడి వల్లనే. నేను రామాయణం అనే కోటలో నివసించేదానిని అని సోనాక్షి వ్యాఖ్యానించారు. తాను ఇంట్లో ప‌దో అంత‌స్తులో ఉంటే, అమ్మా నాన్న ఐద‌వ అంత‌స్తులో నివ‌శించేవార‌ని తెలిపింది.

అలాగే తాను ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లినా లేదా త‌ను ఇంటికి వ‌చ్చినా వెంట‌నే త‌న‌ను గ‌మ‌నించే టెలీఫోన్ ఆప‌రేట‌ర్ మిస్ట‌ర్ ఝా అమ్మానాన్న‌కు ఫోన్ చేసి స‌మాచారం అందించేవార‌ని కూడా సోనాక్షి గుర్తు చేసుకున్నారు. నా కారు ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన నిమిషంలోనే అతడు ఐదవ అంతస్తుకు ఫోన్ చేసి `పాప వచ్చేసింది` అని చెప్పేవాడు. అయితే త‌న త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేయ‌వ‌ద్ద‌ని ఫోన్ ఆప‌రేట‌ర్ ని అడిగాన‌ని కూడా సోనాక్షి తెలిపింది. అర్థ‌రాత్రి త‌ర్వాత ఎక్క‌డికి వెళ్లినా దాని గురించి అమ్మా నాన్న‌ అడిగేవార‌ని, తిట్టేవార‌ని కూడా తెలిపింది సోనాక్షి. ఇది ప్ర‌తి ఇంటి క‌థ అని అన్నారు. అలాగే త‌న తండ్రికి ఫిర్యాదు అందితే ఏమనుకుంటాడో అని భావించేది. కానీ నాన్న గారు ప్ర‌పంచంలోనే అత్యంత కూల్ గా ఉండే వ్య‌క్తి అని సోనాక్షి అంది. తండ్రి శ‌త్రుఘ్న సిన్హా త‌న‌ను ఎప్పుడూ తిట్ట‌లేద‌ని కూడా గుర్తు చేసుకుంది.

సోనాక్షి సిన్హా గత సంవత్సరం జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. కొన్నేళ్ల పాటు ప్రేమ‌కోసం పోరాడి చివ‌రికి గెలిచింది. సోనాక్షి - జహీర్ ప్రత్యేక వివాహ చట్టం నిబంధనల కింద వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు కొన్నేళ్ల పాటు ఈ జంట ప్రేమాయ‌ణం సాగించింది.