Begin typing your search above and press return to search.

సముద్ర గ‌ర్భంలో స్టార్ క‌పుల్ సాహ‌సాలు

తాజాగా విహార‌యాత్ర నుంచి కొన్ని అంద‌మైన ఫోటోలు, వీడియోల‌ను సోనాక్షి షేర్ చేసింది. ఇన్‌స్టాలో సోనాక్షి ఇలా రాసింది.

By:  Tupaki Desk   |   20 Dec 2024 5:32 PM GMT
సముద్ర గ‌ర్భంలో స్టార్ క‌పుల్ సాహ‌సాలు
X

సోనాక్షి సిన్హా- జహీర్ ఇక్బాల్‌ల హనీమూన్ ఇంకా ముగిసిపోలేదు. ఈ ఏడాది జూన్‌లో పెళ్లి త‌ర్వాత సోనాక్షి- జ‌హీర్ ఇక్బాల్ జంట వ‌రుస వెకేష‌న్‌ల‌తో హ‌నీమూన్‌ని ప్ర‌త్యేకంగా ప్లాన్ చేసుకున్నారు. సింగపూర్, ఫిలిప్పీన్స్, ఇటలీ తర్వాత ఈ ప్రేమ‌ప‌క్షులు ఆస్ట్రేలియా బీచ్‌లో వాలడం ఆస‌క్తిని క‌లిగించింది. అంద‌మైన ద్వీపంలో గ్రేట్ బారియర్ రీఫ్‌లో స్పెష‌ల్ విహార‌యాత్ర‌ను ప్లాన్ చేయ‌డంతో అది చాలా స్పెష‌ల్ గా మారింది.

సోనాక్షి ఇటీవల గ్రేట్ బారియర్ రీఫ్‌లో 'ఎపిక్ డైవ్ డే' స్నీక్ పీక్‌ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది. ఆస్ట్రేలియాలో ఈ అంద‌మైన‌ విహారయాత్ర అభిమానులను విస్మయానికి గురి చేస్తోంది. బీచ్ లొకేష‌న్ లో అద్భుత‌మైన ఫోటోలు, వీడియోల‌ను సోనాక్షి షేర్ చేస్తుంటే వాటికి మంత్ర‌ముగ్దులైపోతున్నారు

తాజాగా విహార‌యాత్ర నుంచి కొన్ని అంద‌మైన ఫోటోలు, వీడియోల‌ను సోనాక్షి షేర్ చేసింది. ఇన్‌స్టాలో సోనాక్షి ఇలా రాసింది. ''గ్రేట్ బారియర్ రీఫ్‌లో EPIC డైవ్ డేకి ధన్యవాదాలు! మాకు ఉత్తమ ప్రదేశాలను చూపించారు. నెమోను కనుగొనడంలోను ఈ ట్రిప్ మాకు సహాయపడింది. మేము ఉత్తమ సమయాన్ని ఆస్వాధించాము'' అని తెలిపింది.

విహార యాత్ర‌లో సోనాక్షి, జ‌హీర్ జంట సాహసాలు ఆక‌ట్టుకున్నాయి. డీప్ సీలో డైవ్ చేస్తూ ఫోటోలు దిగారు. ఇద్దరూ తమ గైడ్ నుండి సూచనలను జాగ్రత్తగా వింటున్నారు. వీడియోలలో సముద్ర జీవులతో నీటి అడుగున సాహసాలు ఆక‌ట్టుకున్నాయి. రంగురంగుల పగడాలు, చేపలు డీప్ సీలో క‌నిపిస్తున్నాయి. ఈ జంట నీటి అడుగున పోజులిచ్చినప్ప‌టి ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. కొత్తగా పెళ్లయిన జంట తమ డైవ్‌ను పోస్ట్ చేసిన తర్వాత యాచ్‌లోకి తిరిగి వచ్చినప్పుడు కొన్ని సెల్ఫీలను క్లిక్ చేశారు.