Begin typing your search above and press return to search.

'జటాధర': పవర్ఫుల్ సోనాక్షి వచ్చేసింది

బాలీవుడ్ బ్యూటీ సొనాక్షి సిన్హా తన కెరీర్‌లో తొలిసారిగా టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది.

By:  Tupaki Desk   |   8 March 2025 6:51 AM
జటాధర: పవర్ఫుల్ సోనాక్షి వచ్చేసింది
X

బాలీవుడ్ బ్యూటీ సొనాక్షి సిన్హా తన కెరీర్‌లో తొలిసారిగా టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఇప్పటి వరకు కమర్షియల్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించిన ఆమె, ఈసారి పూర్తిగా భిన్నమైన కథను ఎంచుకుంది. పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతున్న సూపర్‌నేచురల్ థ్రిల్లర్ జటాధర చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేయడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

సినిమా ఫస్ట్ లుక్ చూస్తే, సొనాక్షి పాత్ర ఎంతో పవర్ఫుల్ అని స్పష్టంగా అర్థమవుతోంది. ఆమె వేషధారణ, మంత్రతంత్రాల నేపథ్యంలో ఉండే పౌరాణికమైన లుక్, కళ్లలో ఓ భయంకరమైన ఆలోచన కనిపించేలా తీర్చిదిద్దారు. సాధారణమైన కమర్షియల్ గ్లామర్ రోల్స్ కంటే భిన్నంగా, భయపెట్టే పాత్రలో ఆమె కనిపించడం సినిమాపై మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.

బాలీవుడ్‌లో దబాంగ్ సినిమాతో తెరంగేట్రం చేసినప్పటి నుంచి సొనాక్షి తన అభినయంతో మంచి పేరు సంపాదించుకుంది. కమర్షియల్ సినిమాలు చేస్తూనే, లూటేరా లాంటి పాత్రలతో నటిగా తనను తాను నిరూపించుకుంది. ఇప్పుడు తెలుగులో తొలి సినిమా కోసం అలాంటి విభిన్నమైన కథనే ఎంచుకోవడం విశేషం. ఓవైపు పౌరాణికత, మరోవైపు సూపర్‌నేచురల్ థ్రిల్లర్ మిక్స్ అయిన ఈ చిత్రం, తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే అవకాశం ఉంది.

ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. మౌంట్ అబూ ప్రాంతంలో మార్చి 10న మొదలయ్యే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం అంతా సిద్ధమవుతోంది. ఉమేష్ KR బన్సాల్, శివిన్ నారంగ్, అరణ్య అగర్వాల్, ప్రేరణ అరోరా, నిఖిల్ నందా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కనుంది.

తెలుగు సినిమాకు ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు వస్తోంది. తెలుగు పరిశ్రమలో మిథాలజికల్ థ్రిల్లర్స్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఈ సినిమా కూడా భిన్నమైన కథతో ముందుకు వస్తే, ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుందనే నమ్మకం ఉంది. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్‌లో ఉండేలా ప్లాన్ చేయడం, విజువల్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం వల్ల ‘జటాధర’ సినిమా మరింత వేరే లెవెల్‌కు వెళ్లే అవకాశం ఉంది.