అట్ల తద్ది రోజు భర్తతో స్టార్ హీరోయిన్ ఫన్!
తెలుగు లోగిళ్లలో అట్ల తద్దిగా పిలుచుకునే పండుగను ఉత్తరాదిన కర్వా చౌత్ గా పిలుస్తున్నారు.
By: Tupaki Desk | 21 Oct 2024 12:08 PM GMTతెలుగు లోగిళ్లలో అట్ల తద్దిగా పిలుచుకునే పండుగను ఉత్తరాదిన కర్వా చౌత్ గా పిలుస్తున్నారు. ఈసారి అట్ల తద్దికి బాలీవుడ్ లో కొత్త జంటల హంగామా మామూలుగా లేదు. పెళ్లయాక మొదటి కర్వా చౌత్‌ని వైభవంగా జరుపుకునేందుకు కథానాయికలు ఉత్సాహం ప్రదర్శించారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, సోనాక్షి సిన్హా ప్రముఖంగా ఉన్నారు. ఇంతకుముందే రకుల్ ప్రీత్ కర్వా చౌత్ వేడుకల ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.
షాట్ గన్ శత్రుఘ్న సిన్హా నటవారసురాలు సోనాక్షి సిన్హా ఆదివారం నాడు భర్త జహీర్ ఇక్బాల్‌తో కలిసి తన మొదటి కర్వా చౌత్‌ను జరుపుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఉత్సవాల నుండి అందమైన మూవ్ మెంట్స్ ని ఈ జంట షేర్ చేసుకున్నారు. సోనాక్షి ఈ తెల్లవారుజామున బ్రైడల్ రెడ్ దుస్తులలో తన అద్భుతమైన ఫోటోలను షేర్ చేసింది. ఆ తర్వాత సంప్రదాయ ఉపవాసాన్ని పాటిస్తూ తనకు ఆకలి వేస్తున్న విషయాన్ని చలోక్తిగా హాస్యంగా వ్యక్తం చేసింది.
ఇన్‌స్టా వీడియోలో సోనాక్షి ఫన్ ఎంతో ఆకట్టుకుంది. లేత గులాబీ రంగు ఎంబ్రాయిడరీ దుస్తులను ధరించిన ఈ బ్యూటీ తన తలకట్టుపై సాంప్రదాయ పూల గజ్రాను ధరిస్తూ కనిపించింది. భర్త జహీర్ పసుపు రంగు టాప్ ధరించి, ఆమె పక్కన కూర్చుని ఫోన్లో మునిగిపోయి కనిపించాడు. సోనాక్షి తన తలపై గజ్రాను పెట్టుకుని జహీర్‌ను ఆప్యాయంగా `జాన్` అని పిలుస్తూ కనిపించిన క్లిప్ వైరల్ అయింది. అతడు తలెత్తి చూస్తూ.. `ఏం చేస్తున్నావు యార్?` అని అడిగాడు. సోనాక్షి స్పందిస్తూ ``నాకు చాలా ఆకలిగా ఉంది. ఏమి చేయాలో నాకు తెలియదు``అంటూ ఇద్దరూ ముసిముసిగా నవ్వులు షేర్ చేసారు.
భర్త జహీర్‌ని సోనాక్షి ఆకలిగా లేదా? అని అడుగుతోంది. దానికి జహీర్ `చాలా` అని సమాధానం ఇచ్చాడు. సోనాక్షి ఫన్ని కొనసాగిస్తూ.. `ఎందుకు ఆకలిగా ఉంది?` అని ప్రశ్నించింది. జహీర్ కొంటెగా..`ఎందుకంటే అదే` అని అన్నాడు. ఈ మొత్తం ఎపిసోడ్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. సోనాక్షి అతడిని ఆటపట్టిస్తూ ``ఎందుకంటే నేను కర్వా చౌత్‌ని ఉంచాను. మీరు కర్వా చౌత్‌ను ఎందుకు ఉంచారు?.. జహీర్ స్వీట్ గా మాట్లాడుతూ..``ఎందుకంటే నేను మీ ముందు భోజనం చేసి ఉంటే, మీరు నన్ను చంపి ఉండేవారు` అంటూ నవ్వేశాడు. సోనాక్షి జహీర్‌ను ఆటపట్టించడంతో సరదా సంభాషణ మరింత నవ్వులకు దారితీసింది. ఆమె ఈ పోస్ట్‌కి అందమైన క్యాప్షన్ ఇచ్చింది..``ఒంటరిగా ఆకలితో అలమటించని వ్యక్తిని కనుగొనండి... అతడి కారణం ఏదైనా కావచ్చు.. హ్యాపీ కర్వా చౌత్… మా మొదటి పండుగ.. అని సోనాక్షి రాసింది.