Begin typing your search above and press return to search.

పెళ్ల‌యిన నాలుగు నెల‌ల‌కే న‌టి గ‌ర్భిణి?

కొన్నేళ్లుగా ప్రేమాయ‌ణం సాగిస్తున్న‌ ఈ జంట కేవలం నాలుగు నెలల క్రితం.. అంటే జూన్ 2024లో వివాహం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   28 Oct 2024 11:30 PM GMT
పెళ్ల‌యిన నాలుగు నెల‌ల‌కే న‌టి గ‌ర్భిణి?
X

సోనాక్షి సిన్హా - జహీర్ ఇక్బాల్ బాలీవుడ్ లో కొత్తగా పెళ్లయిన జంట. కొన్నేళ్లుగా ప్రేమాయ‌ణం సాగిస్తున్న‌ ఈ జంట కేవలం నాలుగు నెలల క్రితం.. అంటే జూన్ 2024లో వివాహం చేసుకున్నారు. చాలా మంది బాలీవుడ్ జంటలు తమ వివాహ వేడుకలను ఘ‌నంగా నిర్వ‌హించ‌గా .. దానికి భిన్నంగా సోనాక్షి - జహీర్ చాలా సింపుల్ వెడ్డింగ్ తో ఒక‌ట‌య్యారు. ఇంట్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఒక సాధార‌ణ‌ వేడుక‌లో ఇద్దరూ ఒక‌ట‌య్యారు. అప్పటి నుండి వారు క్రమం తప్పకుండా జంట లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ఇప్పుడు సోనాక్షి తాజా పోస్ట్ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ముఖ్యంగా నెటిజనుల్లో `గర్భధారణ` పుకార్లకు తెర తీసింది.

దీపావళి సమీపిస్తున్న సమయంలో సోనాక్షి సిన్హా- జహీర్ ఇక్బాల్ తార‌ల‌తో జ‌రిగే స్పెష‌ల్ పార్టీకి హాజరవుతున్నారు. ఈ అంద‌మైన జంట‌ కలిసి బయటకు వచ్చినప్పుడల్లా కెమెరాల ముందు ఫోజులివ్వ‌డం క‌నిపిస్తోంది. నిన్న కూడా ఒక చిన్న ఫోటోషూట్ లో పాల్గొన్నారు. సోనాక్షి - జహీర్ ఇద్దరూ అద్భుతంగా కనిపించినా కానీ, సోనాక్షి బిడ్డను మోస్తోందా? అని నెటిజనులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఆమె ఫోటోల‌కు `క్యాప్షన్`లో గర్భవతి అని రాస్తున్నారు.

అయితే సోనాక్షి షేర్ చేసిన రెండు ఫోటోగ్రాఫ్స్ లోను చేతిలో ఒక కుక్కపిల్ల ఉంది. అది వారి చిన్న కుటుంబానికి సరికొత్త చేరికగా అనిపించింది. మొదటి ఫోటోలో క్యూట్ ప‌ప్పీ తో జంట అందంగా కనిపించింది. రెండవది వారి సంతోషం వారి ముఖాల్లో చిరునవ్వు ద్వారా ప్రతిబింబించింది. సోనాక్షి కూడా దానినే క్యాప్షన్ ఇచ్చింది.

వ్యాఖ్యల‌ విభాగం అభిమానుల వ్యాఖ్య‌ల‌తో నిండిపోయింది. కొంద‌రు నెటిజన్లు సోనాక్షిని అభినందించారు. త‌న‌ గర్భధారణ స్థితి గురించి ప్రశ్నించారు. ``త్వరలో బుజ్జాయికి జ‌న్మ‌నిస్తున్నందుకు శుభాకాంక్ష‌లు`` అని రాసాడు. మరొక వ్యాఖ్యాత `గర్భిణీ హై క్యా?` అని అడిగాడు. సోనా గర్భవతిగా కనిపిస్తోంది అని మరొక‌రు వ్యాఖ్యానించారు.

సోనాక్షి సిన్హాపై ప్రెగ్నెన్సీ పుకార్లు ఇదే మొదటిసారి కాదు. కొన్ని నెలల క్రితం ఈ జంట ఆసుపత్రిని సందర్శించడంతో పుకార్ పుట్టుకొచ్చింది. అయితే ఆ పుకార్ల‌ను సోనాక్షి కొట్టి పారేసింది. సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ తమ బంధాన్ని ఏడేళ్ల పాటు రహస్యంగా ఉంచారు. జంట‌గా క‌లిసి అనేక ఈవెంట్‌లలో కనిపించినప్పటికీ సోనాక్షి - జహీర్ డేటింగ్ చేస్తున్నారో లేదో అధికారికంగా ధృవీకరించలేదు.

ఈ జంట ఎందుకు అంత రహస్యంగా ఉన్నారని అడిగినప్పుడు సోనాక్షి `చెడు కన్ను ప‌డ‌కూడ‌దు` అని స‌మాధానం ఇచ్చింది. ప్రైవేట్ విషయాలను గోప్యంగా ఉంచడం ఎల్లప్పుడూ మంచిదని నేను భావిస్తున్నాను. మ‌న‌కు ఇష్ట‌మైన‌ది దాచోవాల‌ని వ్యాఖ్యానించింది.