Begin typing your search above and press return to search.

కొత్త కారులో న‌వ‌దంప‌తుల షికారు!

జ‌హీర్ కూడా కొన్నాళ్ల‌పాటు వృత్తిగా దూరంగా ఉండాల‌ని నిర్ణయించుకున్నాడు.

By:  Tupaki Desk   |   26 Jun 2024 7:28 AM GMT
కొత్త కారులో న‌వ‌దంప‌తుల షికారు!
X

సోనాక్షి సిన్హా-జ‌హీర్ ఇక్బాల్ వివాహంతో ధాంప‌త్య జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఏడేళ్ల ప్రేమ‌ని ఇరుకుటుంబ స‌భ్యులు అర్దం చేసుకుని పెద్ద‌ల స‌మక్షంలో ఎంతో గ్రాండ్ గా వివాహం జ‌రిగింది. ప్ర‌స్తుతం ధాంప‌త్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కొన్నాళ్ల పాటు సోనాక్షి ఎలాంటి షూటింగ్ ల‌కు హాజ‌రు కాదు. జ‌హీర్ కూడా కొన్నాళ్ల‌పాటు వృత్తిగా దూరంగా ఉండాల‌ని నిర్ణయించుకున్నాడు.

జీవితంలో సెకెండ్ ఇన్నింగ్స్ జీవితాంతం గుర్తిండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. దీనిలో భాగంగా తాజాగా శ్రీమ‌తికి ఓ ఖ‌రీదైన ల‌గ్జ‌రీ కారు కూడా కొనిచ్చాడు అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. రెండు కోట్ల ఖ‌రీదుగల బీఎండ‌బ్ల్యూ కారును సోనాక్షికి గిప్ట్ గా ఇచ్చాడు. అయితే ఇది పెళ్లికి ముందే కొన్నాడుట‌. అప్పుడే బ‌హుక‌రించాడుట‌. కానీ ఈవిష‌యం దాచి పెట్టారు.

పెళ్లి త‌ర్వాత సోనాక్షి ఇలా అభిమానుల్ని సర్ ప్రైజ్ చేసింది. వివాహం త‌ర్వాత జంట‌గా ఈకారులో క‌లిసి ఓ రెస్టారెంట్ కి వెళ్లారుట‌. ఆ కారును స్వ‌యంగా సోనాక్షి డ్రైవ్ చేయ‌గా ప‌క్క‌నే హ‌బ్బీ కూర్చుని ఉన్నాడు. ఇక‌పై సోనాక్షి సిన్హా రెగ్యుల‌ర్ వాడ‌కంలో పెడుతుంద‌ని స‌మాచారం. ఏ సినిమా షూటింగ్ కి వెళ్లినా ఈ కారులోనే వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుందిట‌. ఈ కారును జీవితంలో ఓ జ్ఞాప‌కంగా మ‌లుచుకోవాల‌న్న ఆలోచ‌న‌లో సోనాక్షి ఉందిట‌.

ప్రేమికుడు, భ‌ర్త సొంత క‌ష్టంతో కొనుగోలు చేసి ఇచ్చిన కారు కావడంతోనే సోనాక్షి ఇంత ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని స‌మాచారం. సోనాక్షి సొంత డ‌బ్బుతో ఇష్ట‌మైన కార్లు కొనుక్కుంది. అలాగే తండ్రి, అన్న‌య్య‌లు కూడా అభిమానంతో ఇచ్చిన బ‌హుమ‌తులు ఎన్నో ఉన్నాయి. వాటిని అంతే జాగ్ర‌త్త‌గా చూసుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతుంద‌ని తెలుస్తుంది.