సెట్లో ఉండగానే గర్భం దాల్చారు.. నాకు ఇంకా పెళ్లి కాలేదు!-సోనాక్షి
ఇటీవల ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో కనిపించిన సోనాక్షి తనదైన శైలి హాస్యంతో అందరినీ ఆకట్టుకుంది.
By: Tupaki Desk | 12 May 2024 4:33 PM GMTసినిమా సెట్లో ఉండగానే సహ నటీమణులు పెళ్లాడేసారు. అంతేకాదు.. కొందరు ఫ్రెగ్నెంట్లు అయ్యారు! కానీ నాకు ఇంకా పెళ్లి కాలేదు! అని కలత చెందుతోంది సోనాక్షి సిన్హా. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండిలో సోనాక్షి అద్బుత నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. మనీషా కొయిరాలా, అదితి రావు హైదరీ, రిచా చద్దా, సోనాక్షి సిన్హా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ తదితరులు ఇందులో నటించారు. సీనియర్ నటీమణుల నడుమ సోనాక్షి నెగెటివ్ షేడ్ పాత్రకు ప్రత్యేక గుర్తింపు దక్కింది.
ఇటీవల ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో కనిపించిన సోనాక్షి తనదైన శైలి హాస్యంతో అందరినీ ఆకట్టుకుంది. హోస్ట్ కపిల్.. అందాల కథానాయికలు అలియా భట్, కియారా అద్వానీ పెళ్లి గురించి ప్రస్తావించినప్పుడు సోనాక్షి పెళ్లి గురించి ప్రస్థావన వచ్చింది. ఆ సమయంలో సోనాక్షి నిజాయితీగా సమాధానం ఇచ్చింది. ``జలే పర్ నమక్ చిదక్ రహే హో`` అని అంది. తాను `నిరాశ`తో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది.
మేం హీరామాండి షూటింగ్ పూర్తి చేసాము.. నాకు ఇంకా వివాహం కాలేదు. షర్మిన్ కూడా పెళ్లి చేసుకున్నాడు అని అంది. మనీషా కొయిలారా వెంటనే రిచా చద్దా వైపు చూపిస్తూ తను కూడా వివాహం చేసుకుంది.. గర్భవతి అయింది! అని తెలిపింది. రిచా చద్దా ఉల్లాసంగా స్పందిస్తూ..``ఇది నాకు మంచి అభ్యాసం. నా దుస్తుల బరువు 30 కిలోలు. . తరువాత నేను నా పెళ్లి దుస్తులను ధరించినప్పుడు అవి అసలు బరువు ఏమీ లేనట్లు అనిపించింది. నేను సులభంగా ఎక్కడ అయినా దూకుతూ ఆడగలను. ఇది చాలా తేలికగా అనిపించింది``అంటూ పరిహాసంగా మాట్లాడింది.
హీరామండిలో ఒక కీలక పాత్ర పోషించిన షర్మిన్ సెగల్ నవంబర్ 2023లో అమన్ మెహతాను వివాహం చేసుకుంది. షర్మిన్ భన్సాలీ మేనకోడలు.. హీరామండిలో మల్లిక్‌జాన్ కుమార్తె అలంజేబ్ పాత్రను పోషించింది. కానీ తన అసంపూర్ణమైన నటనపై విమర్శలొచ్చాయి. రిచా చద్దా - అలీ ఫజల్ 2020లో చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు, అయితే 2022లో పెళ్లి విందుతో సెలబ్రేషన్ జరుపుకున్నారు. ఫిబ్రవరి 2024లో ఈ జంట తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నట్టు ప్రకటించారు.
హీరామండి ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో శేఖర్ సుమన్, అధ్యాయన్ సుమన్ తదితరులు నటించారు. వేశ్యా గృహాలు రాజకీయాల నేపథ్యంలో సిరీస్ ఇది. పాకిస్తాన్ లాహోర్ నేపథ్యంలో కథాంశం సాగుతుంది. క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి.