Begin typing your search above and press return to search.

ప్రియుడితో సోనాక్షి పెళ్లి ఎలా జరిగింది? ఆ రూల్స్ ఏంటి?

బాలీవుడ్ టు టాలీవుడ్.. అనేక మంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా ఒక్కొక్కరిగా వివాహ బంధంలో అడుగుపెడుతున్నారు

By:  Tupaki Desk   |   24 Jun 2024 2:38 PM GMT
ప్రియుడితో సోనాక్షి పెళ్లి ఎలా జరిగింది? ఆ రూల్స్ ఏంటి?
X

బాలీవుడ్ టు టాలీవుడ్.. అనేక మంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా ఒక్కొక్కరిగా వివాహ బంధంలో అడుగుపెడుతున్నారు. వరుసగా పలువురు నటీనటుల పెళ్లిళ్లు జరిగాయి/ జరుగుతున్నాయి. తాజాగా బీటౌన్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా.. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలో వారి పెళ్లి.. అతి తక్కువ మంది సమక్షంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చాలా సింపుల్ గా జరిగింది.

ఆ తర్వాత ఇన్ స్టాలో తన పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది సోనాక్షి. పెళ్లి జరిగిన రోజు సాయంత్రం ముంబైలో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసింది. అంతవరకు బాగానే ఉన్నా.. సోనాక్షి వివాహం వెనుక పెద్ద తతంగమే జరిగింది! ఆమె మ్యారేజ్ ఫిక్స్ అయినట్లు బయటకు తెలిశాక నెట్టింట భారీగా ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు ఆమె స్పెషల్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకుంది. అయితే అసలేమైంది? ఎందుకు ఎలా ఆమె పెళ్లి చేసుకుంది?

గుజరాత్ కు చెందిన డైమండ్ బిజినెస్ మ్యాన్ కొడుకైన ఇక్బాల్.. 2019లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత డబుల్ ఎక్స్ ఎల్ లో నటించగా.. ఆ సినిమాలో సోనాక్షి కూడా యాక్ట్ చేసింది. ఆ సమయంలో వారిద్దరూ ప్రేమలో పడ్డట్లు పెద్ద ఎత్తున టాక్ వినిపించింది. కానీ అంతకు ఐదు సంవత్సరాల ముందే వారిద్దరికీ పరిచయం ఏర్పడిందట. అది కాస్త ప్రేమగా మారగా.. అప్పటి నుంచి ఇద్దరు కూడా డేటింగ్ లో ఉన్నారు.

కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత సోనాక్షి, ఇక్బాల్ తమ ఇళ్లల్లో చెప్పి పెళ్లికి ఒప్పించారు. వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఈ విషయం తెలియగానే నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. అదే సమయంలో సోనాక్షి తల్లి, సోదరుడు కూడా ఆమెను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసినట్లు, ఇది మతాంతర వివాహం కనుక తల్లీకొడుకులకు ఇష్టం లేదని వార్తలు వచ్చాయి. వాటిని సోనాక్షి సిన్హా తండ్రి శత్రుఘ్న సిన్హా కొట్టిపారేశారు.

ఇక్బాల్ తండ్రి కూడా సోనాక్షి మతమార్పిడి విషయాన్ని ఖండించారు. హిందూ లేదా ఇస్లాం సంప్రదాయం ప్రకారం కాకుండా.. సివిల్ మ్యారేజ్ జరుగుతుందని తెలిపారు. ఆయన చెప్పినట్లే సోనాక్షి, ఇక్బాల్ పెళ్లి.. ఇండియన్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ప్రకారం జరిగింది. ఆ యాక్ట్ ప్రకారం ఏ మత సంప్రదాయాలతోపాటు ఆచారాలు పాటించాల్సిన అవసరం లేదు. వధూవరులు సంతకాలు చేస్తే ఆ చట్ట ప్రకారం పెళ్లి జరిగిపోయినట్లే. మొత్తానికి సోనాక్షి, ఇక్బాల్ ఇలా ఒక్కటయ్యారు.