సోనాక్షి ఆసుపత్రి..గర్భం గురించి ఏమందంటే?
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా-రైటర్ జహీర్ ఇక్బాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 6 July 2024 6:07 AM GMTబాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా-రైటర్ జహీర్ ఇక్బాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకున్న రెండు రోజులకే ఇద్దరు ఆసుపత్రిలో ప్రత్యక్షమయ్యారు. దీంతో మీడియాలో రకరకాల కథనాలు వైరల్ అయ్యియి. అందులో ముఖ్యంగా సోనాక్షి గర్భం దాల్చిందని ఆ కారణంగానే ఆసుపత్రికి చెకప్ కోసం వెళ్లినట్లు మీడియాలో ప్రచారం సాగింది. అయితే ఇదే సందేహాన్ని ఓ నెటి జనుడు తాజాగా సోనాక్షి ముందుకు తీసుకెళ్లాడు.
దీంతో ఆమె రిప్లై ఇచ్చింది. అందుకోసం మేమిప్పుడు ఆసుపత్రికి వెళ్లలేం. వెళ్తే గర్భవతిని చేసేస్తారు? అందుకే ఇప్పట్లో ఆసుపత్రికి వెళ్లే ఉద్దేశం మాకు లేదు. మా పనిలో మేమంతా చాలా బిజీగా ఉన్నాం` అని రిప్లై ఇచ్చింది. దీంతో అవన్నీ తప్పుడు కథనాలని మరోసారి క్లారిటీ వస్తోంది. అయితే సోనాక్షి సిన్హా ఆసుపత్రికి వెళ్లడానికి అసలు వేరే ఉందన్నది తర్వాత తెలిసిందే. తండ్రి శత్రుజ్ఞ సిన్హా అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్చారు.
తొలుత రెగ్యులర్ చెకప్ లో భాగం వెళ్లారని ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత అసలు కారణం అది కాదని తేలింది. తండ్రితో పాటు ఆసుపత్రికి వెళ్లినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ సంగతి పక్కనబెడితే ప్రస్తుతం కొత్త దంపతులు ఇద్దరు హనీమూన్ లో ఉన్నారు. విదేశాల్లో అందమైన ప్రదేశాలు చుట్టేస్తున్నారు. తిరిగొచ్చిన తర్వాత కొత్త కాపురం మొదలువుతుంది. ఇప్పటికే కుమార్తెకి గిప్ట్ గా తండ్రి ఓ ఖరీదైన ప్లాట్ కూడా గిప్ట్ గా ఇచ్చినట్లు ప్రచారంలోకి వచ్చింది.
అయితే అందులో వాస్తవం తెలియాల్సి ఉంది. అలాగే సోనాక్షి యధావిధిగా మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుంది. భర్త ఎలాగూ రైటర్ కాబట్టి అడ్డు చెప్పే అవకాశం లేదు. ఇకపై భార్య కోసం ప్రత్యేకంగా స్టోరీలు రాసే అవకాశం లేకపోలేదు. రైటర్ గా పలు సినిమాలకు పనిచేసిన అనుభవాన్ని రంగరించి సోనాక్షిని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లే ఓ స్టోరీ పడితే పంట పండినట్లే.