అలాంటివి నన్ను అడిగితే తప్పుకుంటా..!
తాజాగా హీరామండి సిరీస్ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్ మొత్తంలో ఎప్పుడు కూడా బోల్డ్ సన్నివేశాలు ఉన్న సినిమాలకు కమిట్ అవ్వలేదు అంది.
By: Tupaki Desk | 12 May 2024 6:24 AM GMTసినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా కొనసాగాలంటే స్కిన్ షో తప్పనిసరి. కొన్ని సార్లు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుంది, మరి కొన్ని సార్లు బోల్డ్ గా కూడా నటించాల్సి ఉంటుంది. కమర్షియల్ హీరోయిన్ గా స్టార్‌డమ్ దక్కాలి అంటే తప్పదు. కానీ కొందరు హీరోయిన్స్ మాత్రం ఇందుకు మినహాయింపుగా ఉంటారు.
స్కిన్ షో చేయకుండానే లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది నయనతార. అలాగే బోల్డ్ సీన్స్ మరియు రొమాంటిక్ సీన్స్ కు నో చెబుతూనే 15 ఏళ్లుగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. ఈ అమ్మడు తాజాగా హీరామండి వెబ్ సిరీస్ లో నటించింది.
ఆ వెబ్ సిరీస్ లో నటించిన ఇతర ముద్దుగుమ్మలు కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో కనిపించారు. కానీ సోనాక్షి సిన్హా మాత్రం బోల్డ్ సన్నివేశాలకు దూరంగా ఉంది. తాజాగా హీరామండి సిరీస్ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్ మొత్తంలో ఎప్పుడు కూడా బోల్డ్ సన్నివేశాలు ఉన్న సినిమాలకు కమిట్ అవ్వలేదు అంది.
ఒకవేళ సినిమా షూటింగ్ మధ్యలో బోల్డ్ సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్ కి అడిగినా, నన్ను అలాంటివి చేయమని ఒత్తిడి చేసినా కూడా నేను సినిమా నుంచి తప్పుకునేందుకు కూడా సిద్ధం. అలా కూడా కొన్ని సార్లు జరిగిందని సోనాక్షి చెప్పుకొచ్చింది. అందాల ప్రదర్శణ విషయంలో ఇబ్బంది లేదు కానీ బోల్డ్ సీన్స్ లో మాత్రం నటించేందుకు నో అంటుంది.
హీరోయిన్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సోనాక్షి సిన్హా బోల్డ్ సన్నివేశాల్లో నటించేందుకు ముందస్తుగానే నో చెబుతుంది. తద్వారా ఫిల్మ్ మేకర్స్ అందుకు తగ్గట్లుగానే ఎంపిక చేసుకుంటారు. ఆ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండానే ముందస్తుగా మేకర్స్ తో చర్చలు జరుపుతాను అంది.