హీరోయిన్ పెళ్లికి ముఖ్య అతిథులు వీరే..!
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వివాహ వార్తలు గత వారం రోజులుగా తెగ చక్కర్లు కొడుతున్నాయి.
By: Tupaki Desk | 12 Jun 2024 6:37 AM GMTబాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వివాహ వార్తలు గత వారం రోజులుగా తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే తన కూతురు పెళ్లి విషయం ఇంకా తనకు తెలియదు అంటూ శత్రుఘ్న సిన్హా వ్యాఖ్యలు చేయడంతో పెళ్లి వార్తలు నిజమేనా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
ఇప్పుడు పెళ్లి వార్తలకు కొనసాగింపు అన్నట్లుగా సోనాక్షి సిన్హా తన పెళ్లికి బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ లను ఆహ్వానించిందని, వారు పెళ్లికి హాజరు అయ్యేందుకు ఒప్పుకున్నారని, అందుకు తగ్గట్లుగానే డేట్ ను ఫిక్స్ చేశారని కొత్త వార్తలు వస్తున్నాయి.
జూన్ 23న సోనాక్షి సిన్హా మరియు జహీర్ ల వివాహం వైభవంగా జరుగబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ సంస్థ చూస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కుటుంబ సభ్యుల ఇష్టంతో సోనాక్షి ఈ వివాహం చేసుకుంటుందా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
చాలా కాలంగా జహీర్ తో సోనాక్షి రిలేషన్ లో ఉంది. ఆ మధ్య వీరు సహ జీవనం సాగిస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు పెళ్లికి సంబంధించిన వార్తలు జోరుగా రావడంతో పాటు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని, డేట్ కూడా ఫిక్స్ అవ్వడంతో అందరి దృష్టి వీరి పెళ్లి పై పడింది.
ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న హీరామండి వెబ్ సిరీస్ లో సోనాక్షి సిన్హా నటించిన విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు సినిమాలు, సిరీస్ లు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.