Begin typing your search above and press return to search.

ఆ సినిమాలు ఇష్టం లేదు.. ఐనా చేస్తా!

ఈ మధ్య కాలంలో యంగ్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలను సొంతం చేసుకోలేక పోతుంది.

By:  Tupaki Desk   |   15 July 2024 9:30 AM GMT
ఆ సినిమాలు ఇష్టం లేదు.. ఐనా చేస్తా!
X

స్టార్‌ కిడ్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును మరియు స్టార్‌డమ్‌ ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. ఈ అమ్మడు హిందీలో పలువురు స్టార్‌ హీరోలతో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఈమె చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.

ఈ మధ్య కాలంలో యంగ్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలను సొంతం చేసుకోలేక పోతుంది. అప్పుడప్పుడు సీనియర్‌ హీరోల సినిమాల్లో నటించడంతో పాటు, ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్‌ సినిమాలపై ఈమె ఫోకస్ పెట్టిందనే వార్తలు వస్తున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 14 ఏళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో సోనాక్షి సిన్హా ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న సమస్యలు మొదలుకుని తన అభిరుచి వరకు అనేక విషయాలను ఆమె మాట్లాడటం జరిగింది.

సోనాక్షి మాట్లాడుతూ... హారర్ సినిమాలు చూడటం, చేయడం అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. అయితే ఇటీవల తాను హారర్‌ కామెడీ మూవీ 'కకూద' చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. దర్శకుడు మంచి కథ తో నా వద్దకు వచ్చాడు.

నేను ఎప్పుడైనా దర్శకులు మెచ్చే నటిగా ఉండాలి అనుకుంటాను. అందుకే నేను ఇష్టం లేక పోయినా కూడా కకూద చేశాను. నా పూర్తి బాధ్యత నిర్వర్తించడం ద్వారా ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నాను. ముందు ముందు కూడా నాకు ఇష్టం లేని సినిమాలను దర్శకుల కోసం చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు అంది.