పుట్టినింటి నుంచి మెట్టినింటికి వెళ్తోన్న వేళ!
కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటింకి పంపించే సమయంలో తల్లిదండ్రులు పుట్టెడు దుఖంలో మునిగిపోతారు.
By: Tupaki Desk | 7 July 2024 5:38 PM GMTకుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటింకి పంపించే సమయంలో తల్లిదండ్రులు పుట్టెడు దుఖంలో మునిగిపోతారు. అప్పగింతల వేళ కుమార్తెపై తమకున్న ప్రేమనంతటిని చాటుతారు. ఒకప్పుడు ఈరకమైన ఎమోషన్ చాలా చోట్లా కనిపించేది. కాల క్రమంలో డిజిటల్ యుగానికి వచ్చేసరికి ఆ తీరు చాలా చోట్ల మారింది. పుట్టినింటి నుంచి మెట్టినింటికి నవ్వుతూ సంతోషంగా పంపించడం అలవాటు చేసుకున్నారు.
అప్పుడప్పుడు కుమార్తెపై అత్తవారింటికి వెళ్తోన్న సమయంలో తల్లిదండ్రులు ఎంతగా బాధపడు తున్నారో? కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కనిపిస్తుంది. తాజాగా సోనాక్షి సిన్హా పుట్టినింటిని వదిలి మెట్టినింటికి వెళ్తోన్న సమయంలో పుట్టెడు దుఖాన్ని మనసులో ఉంచుకుని ఇలా బరువెక్కిన హృదయంతో తల్లిదండ్రులు శత్రుజ్ఞ సిన్హా - పూనమ్ సిన్హా మెట్టినింటికి పంపించారు.
తాజాగా ఆ సన్నివేశానికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. తల్లి కుమార్తెను ఎంతో ప్రేమ గా హత్తకుని కన్నీళ్లు చిందించారు. తండ్రి కంటివరకూ వచ్చిన కన్నీళ్లను ఆపుకుని కుమార్తెను సంతోషంగా అత్తవారింటికి పంపించారు. సెలబ్రిటీల్లో ఇది రేర్ పిక్. ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ ఇలాంటి సన్నివేశం మాత్రం చోటు చేసుకోవడం ఇదే అన్నట్లుగా వారి ప్రేమ చెబుతుంది. తాజాగా ఆ పాత జ్ఞాపకాన్ని ఉద్దేశించి సోనాక్షి ఇలా రాసుకొచ్చింది.
`పెళ్లిలో మా అమ్మను తట్టినప్పుడు ఏడుపు ప్రారంభించింది. నేను వెళ్తున్నాను ఆమెకు చెప్పాను. `మా చింతించకండి ... బాంద్రాకు కేవలం 25 నిమిషాలు మాత్రమే జుహు. ఈరోజు వారు నాతో లేరు కాబట్టి ఆ సన్నివేశం గుర్తొచ్చింది` అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. సోనాక్షి కి తల్లిదండ్రులంటే ఎంత ఇష్టమో! కుమార్తె అంటే తల్లిదండ్రులు అంటే అంతకు మించి ప్రేమ అని చెప్పే సమయం ఇది.