ఆమె తల్లి ముందు ఆ సీన్ చేయడానికి సిగ్గు పడ్డాను!
సోనాక్షి తల్లిగారైన పూనమ్ సిన్హా సెట్లో ఉన్నారు. ఆమె ముందు షూట్ లో పాల్గొనడానికి సిగ్గుపడ్డానని ఇంద్రేష్ తెలిపాడు.
By: Tupaki Desk | 7 May 2024 3:00 AM GMTనెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'హీరామండి' ఆన్‌లైన్‌లో విస్త్రతమైన డిబేట్లకు తెర తీసింది. భారీతనం నిండిన ఈ వెబ్ సిరీస్‌పై ఆడియెన్‌లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఈ షోలో నటీమణుల ప్రదర్శనపై గొప్ప ప్రశంసలు కురుస్తున్నా కానీ, భన్సాలీ మేకింగ్ లో లోపాలున్నాయని కొందరు విమర్శించారు. హీరమండి: ది డైమండ్ బజార్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
మనీషా కొయిరాలా, అదితీరావ్ హైదరీ నటనపైనా ప్రశంసలు కురిసాయి. అలాగే సోనాక్షి సిన్హా నటనపైనా పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోనాక్షి సిన్హా లాహోర్ (పాకిస్తాన్) నగరంలో ప్రతీకారం, న్యాయం కోరుతూ పోరాడే ఫరీదాన్ పాత్రలో నటించారు. ఈ పాత్రలో తన నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. పాకిస్తాన్ లాహోర్ నగరం నేపథ్యంలో ఝటిలమైన కథలతో రూపొందించిన 'హీరామండి' సినిమాటిక్ మాస్టర్ పీస్ అని పలువురు ప్రశంసించారు. ఇందులో సోనాక్షి సిన్హా పాత్రకు విస్తృత ప్రశంసలు లభిస్తున్నాయి.
హీరామండిలో ఉస్తాద్ పాత్రలో నటించిన నటుడు ఇంద్రేష్ మాలిక్ మాట్లాడుతూ తాను సోనాక్షితో ఇంటిమేట్ సీన్ లో నటించాల్సి వచ్చిందని, అయితే ఆ సమయంలో ఆమె తల్లి పూనమ్ సిన్హా సెట్ లో ఉండడంతో సిగ్గు పడ్డానని అన్నారు. అయితే సోనాక్షి తనకు ఎంతో సౌకర్యాన్ని కలిగించారని, ఇలాంటి సన్నివేశాలు ఉంటాయని ముందే చర్చించారని కూడా ఆయన అన్నారు.
సోనాక్షి తల్లిగారైన పూనమ్ సిన్హా సెట్లో ఉన్నారు. ఆమె ముందు షూట్ లో పాల్గొనడానికి సిగ్గుపడ్డానని ఇంద్రేష్ తెలిపాడు. సోనాక్షితో ఇంటిమేట్ సీన్ చేయడానికి ముందు భన్సాలీ సర్ ప్రతిదీ వివరంగా చెప్పారని అన్నారు. ''ఈ సన్నివేశానికి ఎక్కువ రీటేక్‌లు అవసరం లేదు.. ఎందుకంటే భన్సాలీ సర్ తను కోరుకున్నది సాధించే వరకు వదిలిపెట్టరు. ఆయన చాలా పర్ఫెక్షనిస్ట్'' అని తెలిపారు. తన పాత్రతో పాటు ఈ చిత్రంలో పాత్రలన్నీ భావోద్వేగాలతో నిండి ఉన్నాయని కూడా వివరించారు.
సోనాక్షిపై ఖిలాడీ ప్రశంసలు
హీరామండిలో సోనాక్షి నటనను ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రశంసించారు. రౌడీ రాథోర్, హాలీడే చిత్రాల్లో అక్షయ్- సోనాక్షి జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భన్సాలీ హీరామండిలో సోనాక్షి అద్భుతంగా నటించారని అక్షయ్ కితాబిచ్చారు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సోనాక్షి సిన్హా పాత్రను అసాధారణమైనది అంటూ అక్షయ్ ప్రశంసించారు.
వేశ్యా గృహాలను గ్లామరైజ్ చేయడం సరికాదు: వివేక్ అగ్నిహోత్రి
మరోవైపు ప్రముఖ దర్శకనిర్మాత వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. ఈ సిరీస్ ని తాను ఇంకా చూడలేదని అయితే భన్సాలీ దీనిని గ్లామరైజ్ చేసి చూపడం సరికాదని విమర్శించారు. వేశ్యా నివాసాలు బాధలకు నెలవు.. వాటిని గ్లామరైజ్ చేసి చూపించడం సరికాదని అన్నారు. వేశ్యా గృహాలు ఎప్పుడూ అందం ఐశ్వర్యం సుఖాలకు నెలవు కాదని, దరిద్రం రాజ్యమేలుతుందని, సృజనాత్మకత అంటే మనిషి బాధలను గ్లామరైజ్ చేయడం కాదని కూడా విమర్శించారు. దీని గురించి తెలియాలంటే శ్యామ్ బెనగల్ తెరకెక్కించిన 'మండి' చూడాలని సూచించారు.