సోనాక్షి హ్యాపీ మ్యారేజ్ మొదటి ఫోటో
సోనాక్షి ఆఫ్-వైట్ చీర మినిమల్ జ్యువెలరీలో అందంగా కనిపించింది. తలలో తెల్ల గులాబీలను జోడించింది. తెల్లటి కుర్తాలో జహీర్ అందంగా కనిపించాడు.
By: Tupaki Desk | 24 Jun 2024 3:59 AM GMTఏడేళ్ల ప్రేమాయణం తర్వాత సోనాక్షి సిన్హా తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ని చివరకు వివాహం చేసుకున్నారు. ప్రేమపక్షులు ఇరువైపులా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఒకటయ్యారు. వారి వివాహానికి సంబంధించిన మొదటి బంచ్ ఫోటోలు తక్షణమే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ అందమైన జంట తమ ప్రేమను గెలిపించుకుంది. అసలు వస్తారో రారో అన్న సందిగ్ధతల నడుమ సోనాక్షి సిన్హా తల్లిదండ్రులు ఈ పెళ్లికి హాజరయ్యారు. సోనాక్షి తండ్రి శత్రుఘ్నసిన్హా, మామ ప్రహ్లద్ నిహలానీ తనను ఆశీర్వదిస్తున్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలను షేర్ చేయడమే గాక.. క్యాప్షన్‌లో ఈ జంట ఇలా రాసారు. ''ఏడేళ్ల క్రితం (23.06.2017) ఒకరి కళ్లలో ఒకరు.. ఇదే రోజున మేం ప్రేమలోని స్వచ్ఛతను చూశాం. దానిని గట్టిగా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ రోజు ఆ ప్రేమ అన్ని సవాళ్లను అధిగమించి విజయానికి మార్గనిర్దేశం చేసింది... ఈ అందమైన క్షణానికి దారితీసింది... మా ఇద్దరి కుటుంబాలు.. మా దేవుళ్లిద్దరి ఆశీర్వాదంతో... మేం ఇప్పుడు భార్యాభర్తలం. ఇప్పటి నుండి ఎప్పటికీ సోనాక్షి - జహీర్.. 23.06.2024.'' అని ఉద్వేగభరితమైన పోస్ట్ ని షేర్ చేసారు.
సోనాక్షి ఆఫ్-వైట్ చీర మినిమల్ జ్యువెలరీలో అందంగా కనిపించింది. తలలో తెల్ల గులాబీలను జోడించింది. తెల్లటి కుర్తాలో జహీర్ అందంగా కనిపించాడు. సోనాక్షి - జహీర్‌లకు జూన్ 23ర వివాహం జరిగినట్లు వరుడి తండ్రి ఇక్బాల్ రతాన్సీ వెల్లడించారు. ఇటీవలి ఇంటర్వ్యూలో జహీర్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ ఈ జంట వివాహం గురించి వెల్లడించారు. దీనికి హిందూ లేదా ముస్లిం ఆచారాలు ఉండవు. ఇది పౌర వివాహం అవుతుంది.. అని అన్నారు.
సోనాక్షి పెళ్లి తర్వాత ఇస్లాం మతంలోకి మారుతుందన్న వార్తలను జహీర్ తండ్రి తోసిపుచ్చారు. కోడలు మతం మారడం లేదు.. అది ఖచ్చితంగా ఉంది. వారిది హృదయాల కలయిక .. మతానికి ఎటువంటి పాత్ర లేదు.. అని అతను చెప్పాడు. ''నేను మానవత్వాన్ని నమ్ముతాను. భగవంతుడిని హిందువులు భగవాన్ అని, ముస్లింలు అల్లా అని పిలుస్తారు. కానీ చివరికి మనమంతా మనుషులం. జహీర్ - సోనాక్షికి నా ఆశీస్సులు ఉన్నాయి'' అని ప్రకటించారు. ఈ పౌర వివాహం తర్వాత సోనాక్షి - జహీర్ ముంబైలోని బాస్టియన్‌లో వివాహ వేడుకలను నిర్వహించనున్నారు. పలువురు బాలీవుడ్ తారలు ఈ వేడుకలు విందుకు హాజరుకానున్నారు. ఇది భారీ విందు కార్యక్రమం అని సమాచారం. గతంలో హనీ సింగ్ -పూనమ్ ధిల్లాన్ కూడా తమకు ఆహ్వానం అందినట్లు ధృవీకరించారు.
సోనాక్షి - జహీర్‌ల వివాహం కేవలం అంతరంగిక వ్యవహారం కాదు. ఎందుకంటే ఈ జంటను ఆశీర్వదించేందుకు బాలీవుడ్‌లోని కొందరు ది ప్రముఖులు హాజరవుతారు. ఈ వివాహానికి నటులు ఆయుష్ శర్మ, హుమా ఖురేషి , వరుణ్ శర్మ హాజరయ్యే అవకాశం ఉందని ఈ జంటకు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో పాటు సల్మాన్ ఖాన్‌కు ఆహ్వానం కూడా పంపారు. సోనాక్షి తన హీరామాండి: ది డైమండ్ బజార్ సహనటులను ఫర్దీన్ ఖాన్, తాహా షా బదుషా, అదితి రావ్ హైదరీ, షర్మిన్ సెగల్ మెహతా సహా ఇతరులను కూడా ఆహ్వానించింది.