Begin typing your search above and press return to search.

సోనాక్షి పెళ్లి కోసం ఆత్రుత నిజ‌మే

అయితే సోనాక్షి పెళ్లి గురించి చాలా కాలంగా రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   10 Jun 2024 5:40 AM GMT
సోనాక్షి పెళ్లి కోసం ఆత్రుత నిజ‌మే
X

వ‌రుస‌గా అందాల క‌థానాయిక‌లు ఓ ఇంటివాళ్ల‌వుతున్నారు. అనుష్క శ‌ర్మ‌, క‌త్రిన‌, ఆలియా భ‌ట్, కియ‌రా అద్వాణీ స‌హా ప‌లువురు భామ‌లు ఫ్యామిలీ లైఫ్ ని ఆస్వాధిస్తూనే క‌థానాయిక‌లుగా ఏల్తున్నారు. ఇప్పుడు అదే త‌ర‌హాలో మ‌రో భామ పెళ్లికి సిద్ధ‌మవుతోంది. ప్ర‌ముఖ వెట‌ర‌న్ క‌థానాయ‌కుడు, రాజ‌కీయ నాయ‌కుడు అయిన శ‌త్రుఘ్న సిన్హా వార‌సురాలు సోనాక్షి సిన్హా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసింది. సోనాక్షి ఇటీవ‌లే భ‌న్సాలీ హీరామండిలో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.

అయితే సోనాక్షి పెళ్లి గురించి చాలా కాలంగా రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. ఈ బ్యూటీ స‌ల్మాన్ ఖాన్ స‌న్నిహితుడు, త‌న స‌హ‌న‌టుడు అయిన‌ జ‌హీర్ ఇక్బాల్‌తో ప్రేమ‌లో ఉంద‌ని, త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. తన చిరకాల భాగస్వామి జహీర్ ఇక్బాల్‌ను జూన్ 23న ముంబైలో వివాహం చేసుకోవడం ద్వారా సోనాక్షి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇండియా టుడే క‌థ‌నం ప్రకారం... మ్యాగజైన్ కవర్ త‌ర‌హాలో రూపొందించిన వివాహ ఆహ్వాన పత్రిక ``పుకార్లు నిజమే`` అనే అంద‌మైన క్యాప్ష‌న్‌తో ప్ర‌త్య‌క్ష‌మైంది. ముంబయిలోని బాస్టియన్‌లో జరిగే ఈ వేడుకకు అధికారికంగా అతిథుల‌ డ్రెస్ కోడ్ ని నిర్ధేశించారు`` అని తెలుస్తోంది. కొంతకాలంగా స‌న్నిహితంగా ఉన్న ఈ జంట వారి సంబంధాన్ని ప్రైవేట్‌గా ఉంచారు. అయితే వారి బహిరంగ ప్రదర్శనలు, ఆప్యాయతతో కూడిన సోషల్ మీడియా పోస్ట్‌లు వారి బలమైన బంధాన్ని ఆవిష్క‌రించాయి. ఈ జంట వివాహ ప్రణాళికల గురించి వివ‌రాలు మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ పెళ్లి కోసం బాలీవుడ్ నుంచి మొత్తం తారాగణాన్ని ఆహ్వానించినట్లు క‌థ‌నాలొస్తున్నాయి.

సోనాక్షి 37వ పుట్టినరోజున త‌న‌తో స‌న్నిహితంగా ఉన్న ఫోటోల‌ను జహీర్ షేర్ చేసాడు. గత సంవత్సరం సోనాక్షి పుట్టినరోజున త‌మ‌ విహారయాత్రల నుంచి అందమైన ఫోటోల‌ను షేర్ చేసాడు. ప్ర‌తిసారీ సోష‌ల్ మీడియాల్లో జ‌హీర్ ని సోనాక్షి ప్రేమ‌గా పిలుస్తుంది. విషెస్ తెలియ‌జేస్తుంది. ఇటీవ‌ల ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలోను సోనాక్షికి పెళ్లి గురించి ప్ర‌శ్న ఎదురైంది. షో లో హోస్ట్ కపిల్ శర్మ తన సహోద్యోగుల వివాహాల గురించి సోనాక్షిని ఆటపట్టించాడు. అవును పెళ్లి కోసం ఆత్రుత‌గా ఉన్నాన‌ని సోనాక్షి స‌ర‌దాగా వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఆ ఆత్రుత నిజ‌మేన‌ని ఇండియా టుడే క‌థ‌నంతో క్లారిటీ వచ్చింది.