కొత్తగా పెళ్లైంది అప్పుడే పనేంటి?
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఇటీవలే ధాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 15 July 2024 4:30 PM GMTబాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఇటీవలే ధాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రేమించిన జహీర్ ఇక్బాల్ ని పెళ్లి చేసుకుని కోడలిగా అత్తారింట్లో కాలు పెట్టింది. ఎలాంటి వివాదాలు..విమర్శలకు తావు ఇవ్వకుండా ఇరువురు పెద్దల్ని ఒప్పించి వాళ్ల సమక్షంలోనే వైభవంగా పెళ్లి చేసుకోవడం అందర్నీ ఎంతో ఆకట్టుకుంది. ఆ జంట ధాంపత్య జీవితం సంతోషంగా సాగిపోవాలని అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా కోరుకున్నారు.
అయితే సోనాక్షి పెళ్లి చేసుకున్నా వెంటనే మళ్లీ వృత్తిలో బిజీ అయింది. ఎంచక్కా హనీమూన్ కి చెక్కేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె మాత్రం ఆ జోలికి వెళ్లకుండా నటిగా బిజీ అయింది. పెళ్లి చేసుకుని రెండు రోజులు గ్యాప్ తీసుకుని యధావిధిగా షూటింగ్ లకు హాజరవ్వడం మొదలు పెట్టింది. దీంతో నెటి జనులు ఆమెని విమర్శించారు. పెళ్లి చేసుకుని ఇలా వెంటనే షూటింగ్ లకు వెళ్లాలా? కొన్ని రోజులు ధాంపత్య జీవితాన్ని ఆస్వాదించొచ్చు కదా? అని ఉచిత సలహాలు ఇచ్చారు.
`అయితే వీటిపై సోనాక్షి సిన్హా ధీటుగా సమాధానం ఇచ్చింది. వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిగత జీవితానికి అంతే ప్రాధాన్యత ఇస్తాను. నా దృష్టిలో రెండు సమానమే. పెళ్లి అయిందని ఇంట్లో కూర్చోవాలని రూల్ లేదు కదా? అయినా ఖాళీగా ఉంటే పని ఎవరు ఇస్తారు. పెళ్లి చేసుకోవాడినికంటే ముందు నేను ఓ నటిని. నాకు చిన్న ప్పటి నుంచి నటన అంటే ఇష్టం. ఆ రంగంలోకి రావాలనుకున్నాను వచ్చాను.
నచ్చిన వ్యక్తి తారసపడటంతో పెళ్లి చేసుకున్నాను. అంత మాత్రాన పని మానేసుకుని మిగతా పనుల్లో బిజీ అవ్వాల్సిన పనిలేదు` అని స్పందించింది. నటిగా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలి. పోటీని తట్టుకుని మార్కెట్ లో నిలబడాలి. ఇవన్నీ తెలిసిన నటి కాబట్టే మరో ఆలోచన లేకుండా బిజీ అయింది.
కొత్తగా పెళ్లైంది అప్పుడే పనేంటి? అన్నారని విమర్శించినట్లు సోనాక్షి తెలిపింది. పెళ్లైన కొన్ని రోజులకే సినిమాలు చేయడంపై విమర్శలు.. వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తికి అందే ప్రాధాన్యత అందుకే షూటింగ్ లకు వెళ్తున్నా..విమర్శలు పట్టించుకోను)