పుట్టినింటికి దూరంగా సోనాక్షి సిన్హా!
ఇటీవలే సోనాక్షి తన సొంత డబ్బుతో ముంబై బాంద్రాలో ఉన్న నాలుగు గదుల ఇంటిని అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 Aug 2024 11:30 PM GMTపెళ్లైన తర్వాత భార్యకి సర్వం మొట్టినిల్లే. పుట్టినిల్లు అనేది వెళ్లి రావడం వరకే పరిమితం అన్న విషయాన్ని సోసాక్షి సిన్హా ఎంతో వంట పట్టించుకున్నట్లు కనిపిస్తుంది. అందుకే అమ్మడు ఇప్పుడిప్పుడు తన డబ్బుతో కొన్న ఇంటిని అమ్మేసి అత్తగారి కనస్ట్రక్షన్ కంపెనీలో కొత్త అపార్ట్ మెంట్ కొనడానికి సిద్దమవుతుంది. అవును నిజమే. ఇటీవలే సోనాక్షి తన సొంత డబ్బుతో ముంబై బాంద్రాలో ఉన్న నాలుగు గదుల ఇంటిని అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే.
25 కోట్లకు బేరం పెట్టింది. ఆ ఇంటితో సోనాక్షి అనుబంధం వీడదీయలేనిది. పెళ్లికి ముందు భర్త జహీర్ ఇక్బాల్ తో అదే ఇంట్లో కలిసి ఉంది. పెద్దల్ని ఒప్పించి అదే ఇంట్లో పెళ్లి కూడా చేసుకుంది. కానీ సడెన్ గా అమ్మకానికి పెట్టే సరికి అంతా షాక్ అయ్యారు. స్వీట్ మెమోరగా ఉండాల్సిన ప్లాట్ ని అమ్మేస్తుంది? ఏంటని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేసారు. కానీ అసలి సంగతి అత్తగారు..భర్తపై విపరీతమైన ప్రేమతోనే ఈ పని చేస్తుందన్నది సంగతి ఇప్పుడు తెలుస్తోంది.
భర్త జహీర్ ఇక్బాల్ కుటుంబానికి చెందిన కనస్ట్రక్షన్ కంపెనీ లోనే ఇంటిని కొనుగోలు చేయాలి అన్న ఉద్దేశంలోనే అమ్మడు అక్కడ ప్లాట్ కోసం ప్రయత్నిస్తుందిట. అక్కడ ప్లాట్ కొనేందుకు 25 కోట్ల బాంద్రాలో ఉన్న ప్లాట్ ని అమ్మేస్తున్నట్లు తెలుస్తోంది. జహీర్ ఇక్బాల్ తల్లిదండ్రులు కూడా అదే గ్రూప్ హౌస్ లో ఉండటంతో అక్కడికి షిప్ట్ అవ్వాలన్నది అమ్మడి ప్లాన్ గా తెలుస్తుంది.
అదే జహీర్ ఇక్బాల్ సోనాక్షితో కలిసి బాంద్రా ప్లాట్ లో ఉంటే? అత్తగారిచ్చిన ఆస్తిలో ఉంటున్నాడు? అన్న మాట తప్పదు. అందుకే భర్తకి, భర్త కుటుంబానికి ఎలాంటి మాట రాకుండా ముందు జాగ్రత్తగా సోనాక్షి జహీర్ ఫ్యామిలీ ఉన్న చోటుకి మారుతున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఉంటోన్న బాంద్రాకి సోనాక్షి అమ్మగారిల్లు దగ్గరేనన్న సంగతి తెలిసిందే.