Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ అలసిన శ‌రీరం మ‌న‌సుకు సాంత్వ‌న ఇలా

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సెల‌బ్రేష‌న్ కి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసింది. ఫిలిప్పీన్స్‌లోని నిర్మలమైన ప్రదేశంలో ఉన్న వెల్నెస్ రిసార్ట్‌లో తన హనీమూన్ నుండి కొన్ని ఫోటోలను సోనాక్షి షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   24 July 2024 4:16 AM GMT
స్టార్ హీరోయిన్ అలసిన శ‌రీరం మ‌న‌సుకు సాంత్వ‌న ఇలా
X

బాలీవుడ్ క‌థానాయిక సోనాక్షి సిన్హా ఇటీవ‌ల తన సహనటుడు జహీర్ ఇక్బాల్‌ని జూన్ 23న వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్ల‌యి ఒక నెల పూర్త‌యినందున‌.. సోనాక్షి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సెల‌బ్రేష‌న్ కి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసింది. ఫిలిప్పీన్స్‌లోని నిర్మలమైన ప్రదేశంలో ఉన్న వెల్నెస్ రిసార్ట్‌లో తన హనీమూన్ నుండి కొన్ని ఫోటోలను సోనాక్షి షేర్ చేసింది. హనీమూన్ సమయంలో తాను, జహీర్ చాలా చేయవలసి ఉంద‌ని సోనాక్షి రాసారు.

కోలుకునేందుకు చేయాల్సిన‌దంతా చేస్తున్నామ‌ని న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించింది. ప్రకృతిలో అనుభవాలను వివరిస్తూ సోనాక్షి హృదయపూర్వక నోట్ రాసింది. ''ఒక వారంలో ఆరోగ్యం అంటే ఏమిటో.. మన శరీరం చెప్పేది వినండి.. మన మనస్సులను జాగ్రత్తగా చూసుకోండి. ప్రకృతి మధ్యలో మేల్కొలపడం, సరిగ్గా తినడం, సమయానికి నిద్రపోవడం, డిటాక్స్ ట్రీట్‌మెంట్‌లు .. మసాజ్‌లు పుష్కలంగా ఉన్నాయి - సరికొత్త అనుభూతిని కలుగుతుంది''అని రాసారు.

సోనాక్షి - జహీర్ తమ 2022 చిత్రం డబుల్ ఎక్స్‌ఎల్ సెట్‌లో ఒకరినొకరు కలుసుకున్నారు. ఆ త‌ర్వాత ప్రేమ‌లో ప‌డ్డారు. ఇప్పుడు పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సోనాక్షి త‌ల్లిదండ్రులు కుటుంబం ఆరంభం నిరాక‌రించినా చివ‌రికి ఈ అంద‌మైన జంట‌ను ఆశీర్వ‌దించ‌డంతో క‌థ సుఖాంత‌మైంది. జహీర్ చివరిసారిగా రుస్లాన్‌లో కనిపించగా, సోనాక్షి ఈ సంవత్సరం ప్రారంభంలో అక్షయ్ కుమార్ బడే మియాన్ చోటే మియాన్‌లో ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించింది. సోనాక్షి తాజా చిత్రం కాకుంద జీలో స్ట్రీమింగ్ అవుతోంది.

సౌత్‌కి అలా ప‌రిచ‌య‌మైంది కానీ:

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా సౌత్ లో లింగా అనే చిత్రంలో న‌టించింది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న సోనాక్షి ఆరంగేట్రం చేసింది. సోనాక్షి అంద‌చందాల‌కు సౌతిండియా ఆడియెన్ మైమ‌రిచారు. కానీ సోనాక్షి ఆ త‌ర్వాత పూర్తిగా బాలీవుడ్ కే అంకిత‌మైంది.