Begin typing your search above and press return to search.

సోనాక్షి సిన్హా పెళ్లి... బ్యాచిలొరెట్‌లో హ్యూమా

సోనాక్షిలానే త‌న‌కు కాబోయేవాడు జహీర్ తన స్నేహితుల కోసం ఒక ఇంటిమేట్ పార్టీని కూడా నిర్వహించాడు.

By:  Tupaki Desk   |   19 Jun 2024 4:07 AM GMT
సోనాక్షి సిన్హా పెళ్లి... బ్యాచిలొరెట్‌లో హ్యూమా
X

బాలీవుడ్ స్టార్ హీరో శ‌త్రుఘ్న సిన్హా న‌ట‌వార‌సురాలు సోనాక్షి సిన్హా తన చిరకాల ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను జూన్ 23 ఆదివారం నాడు వివాహం చేసుకోబోతున్నారు. బిగ్ డేకి ముందు సోనాక్షి సోమవారం రాత్రి తన స్నేహితులతో కలిసి పార్టీని ఆస్వాధించారు. సోనాక్షిలానే త‌న‌కు కాబోయేవాడు జహీర్ తన స్నేహితుల కోసం ఒక ఇంటిమేట్ పార్టీని కూడా నిర్వహించాడు. ఈ జంట తమ సోషల్ మీడియాల్లో ఈ ఫోటోల‌ను షేర్ చేసారు.


పార్టీకి ముందు సోనాక్షి గ్లామరస్ బ్లాక్ బాడీకాన్ డ్రెస్‌లో ఉన్న సెల్ఫీని షేర్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన వేరొక ఫోటోలో సోనాక్షి తన డబుల్ ఎక్స్‌ఎల్ సహనటి హుమా ఖురేషి .. ఇతర స్నేహితులతో క‌లిసి క‌నిపించింది. ఈ సిరీస్‌లోని మూడవ ఫోటోలో సోన్‌కాషి స్నేహితులు కాబోయే వధువుతో పోజులిచ్చారు.

అలాగే సోనాక్షికి కాబోయే భర్త జహీర్ ఇక్బాల్ కూడా తన స్నేహితుల కోసం ఒక ఇంటిమేట్ పార్టీని ఏర్పాటు చేశాడు.అంతకుముందు సోనాక్షి సిన్హా జూన్ 23న జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకోవడానికి సిద్ధం కాగా.. తన కాబోయే అత్తమామలతో ఆదివారం (జూన్ 16) విలువైన స‌మ‌యం గడిపింది. జహీర్ సోదరి .. ప్రముఖ స్టైలిస్ట్ సనమ్ రతాన్సి ఇన్ స్టాలో ఒక ఫోటోని షేర్ చేసాడు.

సోనాక్షి - జహీర్‌ల వివాహ ఆహ్వాన పత్రిక ఒక మ్యాగజైన్ ముఖచిత్రంలా ఈ జంట‌ వెకేషన్‌లలోని వారికి బాగా న‌చ్చిన‌ ఫోటోతో రూపొందించారు.. వారి వివాహ వేడుక జూన్ 23న రాత్రి 8 గంటలకు ముంబైలోని బాస్టియన్‌లో జరుగుతుంది. పెళ్లి రోజు నైట్ కి సంబంధించిన దుస్తుల కోడ్ అధికారికంగా ఉంటుంది. ఎరుపు రంగు దుస్తులు ధరించవద్దని ఈ జంట అతిథులను కోరారు.