Begin typing your search above and press return to search.

ఘాటు ఫోజుల్లో క్యూటీ బ్యూటీ లా!

అటుపై న‌ట‌సింహ బాల‌య్య స‌హ‌కారంతో అత‌ని మూడు చిత్రాల్లో ఛాన్సులందుకుంది.

By:  Tupaki Desk   |   10 Oct 2024 8:30 AM GMT
ఘాటు ఫోజుల్లో  క్యూటీ బ్యూటీ లా!
X

అవ‌కాశాలు వ‌స్తే ఒకే భాష‌లో కొన‌సాగాలి లేదంటే? మ‌ల్టీలాంగ్వేజెస్ ని టార్గెట్ చేయాలి. ఇలా చేయ‌గ‌ల్గేది అతి కొద్ది మంది భామ‌లే. అందులో సోనాల్ చౌహాన్ అనే యూపీ బ్యూటీ ఒక‌రున్నారని త‌ప్ప‌క గుర్తించాలి. అవును అమ్మ‌డు కెరీర్ అలాగే ప్లాన్ చేసుకుని ముందుకు తీసుకెళ్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. 'జ‌న్న‌త్'తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు అటుపై రెయిన్ బో టాలీవుడ్ లోనూ లాంచ్ అయింది.


అటుపై న‌ట‌సింహ బాల‌య్య స‌హ‌కారంతో అత‌ని మూడు చిత్రాల్లో ఛాన్సులందుకుంది. అవిగాక ఇంకొన్ని తెలుగు సినిమాలు చేసింది. కానీ న‌టిగా ఇక్క‌డ బిజీ కాలేదు. అదే స‌మ‌యంలో ఇత‌ర భాష‌ల్లోనూ అంది వ‌చ్చిన అవ‌కాశాలు చేజార్చుకోలేదు. కోలీవుడ్..బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. వ‌చ్చిన ఛాన్స్ మిస్ చేయ‌కూడ‌దు అన్న కోణంలో అమ్మ‌డు ఏ భాష‌ని విడిచిపెట్ట‌లేదు. ఇటీవ‌లే బెంగాలీకి వెళ్లింది.


అక్క‌డ `డార్డ్` అనే సినిమా చేసింది. ఇలా సోనాల్ కెరీర్ లో గ్యాప్ లు లేకుండా చూసుకుంటుంది. ఆ ర‌కంగా సోనాల్ ప‌దేళ్ల‌కు పైగా జ‌ర్నీని దిగ్విజ‌యంగా పూర్తిచేసింది. అలాగే అమ్మ‌డు సోష‌ల్ మీడియాలోనూ అంతే యాక్టివ్ గా ఉంటుంది. కొత్త కొత్త ఫోటోల‌తో కుర్ర‌కారుని ఆకర్షిస్తుంది. తాజాగా అమ్మ‌డు మ‌రో హాట్ పిక్ తో నెటి జ‌నుల ముందుకొచ్చేసింది. అమ్మ‌డు డిజైన‌ర్ దుస్తుల్లో స్కిన్ షో హైలైట్ చేసింది.


సోనాల్ అలంక‌ర‌ణ‌, మ్యాక‌ప్ మ‌రింత అందంగా తీర్చిదిద్దాయి. పెదాల‌పై స‌న్న‌ని న‌వ్వు ఫేస్ కి మ‌రింత గ్లోనీ తీసుకొచ్చింది. ఔట్ ఫిట్, చెవి దిద్దులు అంతే ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.