మాల్దీవుల్లో సోనాల్ పూల్ సైడ్ ట్రీట్
సోనాల్ చౌహాన్ పరిచయం అవసరం లేదు. నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఈ భామ నటించింది.
By: Tupaki Desk | 5 March 2025 9:31 AM ISTసోనాల్ చౌహాన్ పరిచయం అవసరం లేదు. నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఈ భామ నటించింది. టాలీవుడ్ యువహీరోలతోను సోనాల్ కొన్ని అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం కెరీర్ ఆశించినంత జోరుగా లేదు కానీ మోడల్ గా తన స్థాయికి తగ్గ ఛాన్సులు దక్కించుకుంటోంది. ఇక ఇన్ స్టాలో తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో సోనాల్ ఎప్పుడూ ముందుంటుంది.

ఇటీవల కొద్దిరోజులుగా మాల్దీవులకు ప్రచారం కల్పిస్తూ సోనాల్ తన బీచ్ లుక్స్ తో స్టైలిష్ సమ్మర్ ట్రీట్ తో మతులు చెడగొడుతోంది. సోనాల్ బీచ్ డైరీస్ నుంచి కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. సోనాల్ అద్భుతమైన బికినీల్లో దర్శనమిస్తోంది. పూల్ సైడ్ రకరకాల స్విమ్ సూట్లను ధరించి ఫోటోషూట్లతో మైమరిపిస్తోంది.

అదే సమయంలో ప్రముఖ రిసార్ట్ లొకేషన్ కి ప్రచారం చేస్తూ సోనాల్ తాజా ఫోటోషూట్ ని షేర్ చేసింది. పింక్ ప్రింటెడ్ స్విమ్ సూట్ లో సోనాల్ ప్రిపరేషన్ మతులు చెడగొడుతోంది. మంచి పండ్ల రసాలు, రుచికరమైన వంటకాలను స్విమ్ చేస్తూనే ఆస్వాధించేందుకు అందించింది ఈ రిసార్ట్. ఈ సందర్భంగా యూనిక్ ఫోటోషూట్ తో సోనాల్ మతులు చెడగొడుతోంది. ముఖ్యంగా బికినీలో సోనాల్ సొగసరి దేహశిరులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే సోనాల్ చౌహాన్ తదుపరి సినిమాని ప్రకటించాల్సి ఉంది. 2024లో డర్ద్ అనే బంగ్లాదేశీ సినిమాలో నటించింది. అయితే వెబ్ సిరీస్ లలో ఆఫర్లు వస్తున్నా ఈ భామ తిరస్కరిస్తోందట. తదుపరి ప్రాజెక్ట్ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.