Begin typing your search above and press return to search.

బ‌ర్త్ డే పార్టీలో తెలుగు బోల్డ్ న‌టి చిల్లింగ్

దీనికి కార‌ణం నిత్యం ఈ వేదిక‌పై వేడెక్కించే ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డటంలో ఈ బ్యూటీకి సాటి లేరు ఎవ‌రూ!

By:  Tupaki Desk   |   20 May 2024 3:43 PM GMT
బ‌ర్త్ డే పార్టీలో తెలుగు బోల్డ్ న‌టి చిల్లింగ్
X

టాలీవుడ్ అగ్ర హీరో చిత్రాల్లో న‌టించిన సోనాల్ చౌహాన్, ఇటీవ‌ల సౌత్ నుంచి మాయ‌మైంది. హిందీ చిత్ర‌సీమ‌లోను ఈ బ్యూటీ కెరీర్ అంతంత మాత్ర‌మే. కానీ సోష‌ల్ మీడియాల్లో సోనాల్ కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సోనాల్ నిజానికి దక్షిణ భారత పరిశ్రమ నుండి తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించింది. నెమ్మదిగా హిందీ చిత్రాలలోకి షిఫ్ట‌యింది. త‌న‌దైన అందం, నటనా నైపుణ్యంతో ఆక‌ర్షించినా కానీ అదృష్టం ఎప్పుడూ తన‌ను వెంబ‌డించ‌లేద‌నే చెప్పాలి. అయితే సోష‌ల్ మీడియాల్లో సోనాల్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దీనికి కార‌ణం నిత్యం ఈ వేదిక‌పై వేడెక్కించే ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డటంలో ఈ బ్యూటీకి సాటి లేరు ఎవ‌రూ!


సోనాల్ చౌహాన్ అభిమానులను వెర్రివాళ్లను చేసే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోదు. ఈ బ్యూటీ సోషల్ మీడియా ఖాతాలలో స్పెష‌ల్ ఫోటోషూట్ల‌ను పోస్ట్ చేసినప్పుడు త‌న‌ ఆరాధకుల్లో ఉత్సాహం నిండుతుంది. దాదాపు 6.5 మిలియన్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను ఇన్ స్టాలో బంధించి తానేంటో నిరూపించింది. ఇటీవ‌ల‌ నీటి అడుగున ఈత నైపుణ్యాలను ప్ర‌ద‌ర్శిస్తున్న ఫోటోల‌ను షేర్ చేసి తన అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆక్వేరియంలో నీటి అడుగున సాహసాలు చేస్తున్న ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వేగంగా వైర‌ల్ అయ్యాయి. సోనాల్ చౌహాన్ వాట‌ర్ అడ్వెంచ‌ర్ లో ఒక మత్స్యకన్యలా రూపాంతరం చెందింది.


తాజాగా సోనాల్ 37వ బ‌ర్త్ డే వేడుక నుంచి కొన్ని ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. వీటిలో సోనాల్ అంద‌మైన డిజైన‌ర్ డ్రెస్ లో క‌నిపించింది. త‌న సోద‌రి కూడా ఈ బ‌ర్త్ డే పార్టీలో ఉన్నారు. పార్టీలో వైన్ లేదా స్పెష‌ల్ జ్యూస్ సేవిస్తూ గాజు గ్లాస్ తో చిల్లింగ్ గా క‌నిపించిన ఫోటో కూడా బ‌య‌ట‌ప‌డింది. పార్టీ క్రౌడ్ లో సెల‌బ్రిటీలు ఎవ‌రూ క‌నిపించ‌క‌పోవ‌డం కొంత నిరాశ‌.


సోనాల్ తిరిగి టాలీవుడ్ లో న‌టించాల‌ని భావిస్తోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయ్. బోయ‌పాటి, పూరి, ప్ర‌వీణ్ స‌త్తారు ఇలా త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న అంద‌రు ద‌ర్శ‌కుల‌కు ట‌చ్ లోనే ఉందిట‌. అయితే స‌రైన స‌మ‌యంలో స‌రైన ఆఫ‌ర్ వెతుక్కుంటూ రావాల్సి ఉంది. మ‌ళ్లీ ఆ ఒక్క ఛాన్స్ కోస‌మే వెయిటింగ్. కానీ దానికి ఎంత టైమ్ ప‌డుతుందో ఇప్పుడే చెప్ప‌లేం. వెయిటింగ్ త‌ప్ప‌దు.