Begin typing your search above and press return to search.

అందం ఉంది.. వేడి ఉంది.. అయినా కానీ..!

అటు బాలీవుడ్ లోను ఈ భామ న‌టించింది. అడ‌పాద‌డ‌పా అవ‌కాశాలొస్తున్నాయి కానీ, త‌న స్టార్ డ‌మ్ లో ఎదుగుద‌ల అయితే లేదు

By:  Tupaki Desk   |   15 Jun 2024 4:03 AM GMT
అందం ఉంది.. వేడి ఉంది.. అయినా కానీ..!
X

సోనాల్ చౌహాన్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ, నాగార్జున (ఘోస్ట్) స‌హా ప‌లువురు యువ‌హీరోల స‌ర‌స‌న టాలీవుడ్ లో న‌టించింది ఈ బ్యూటీ. కానీ ఆశించిన స్థాయిలో మైలేజ్ ని అందుకోలేక‌పోయింది. పెద్ద స్టార్ల‌తో హిట్లు కొట్టినా కానీ, సోనాల్ కి అదేమీ క‌లిసి రాలేదు. అటు బాలీవుడ్ లోను ఈ భామ న‌టించింది. అడ‌పాద‌డ‌పా అవ‌కాశాలొస్తున్నాయి కానీ, త‌న స్టార్ డ‌మ్ లో ఎదుగుద‌ల అయితే లేదు.

అదే క్ర‌మంలో ఈ యంగ్ బ్యూటీ సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం స్వ‌యం ప్ర‌చారంలో బిజీగా ఉంది. ఇందులో భాగంగానే ప్ర‌పంచం మొత్తం ట్రోల్ చేసిన హీరామండి ఫేం ష‌ర్మిన్ సెగ‌ల్‌ను స‌మ‌ర్థిస్తూ మాట్లాడింది. తాజాగా సోనాల్ తన అధికారిక ఇన్‌స్టాలో షర్మిన్‌ను డిపెండ్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. ఒక సుదీర్ఘ నోట్ ని కూడా రాసింది.

నెటిజన్లు ఒక వ్యక్తిని విలన్‌గా మార్చడం చూస్తుంటే తనకు బాధగా ఉందని సోనాల్ చెప్పింది. ఈ పోస్ట్‌లో ఎవరి పేరు చెప్పనప్పటికీ.. త‌న‌ క్యాప్షన్ షర్మిన్ పై క్రూరమైన ట్రోలింగ్ గురించే వ్యాఖ్యానిస్తోంద‌ని సూచించింది. న‌టీమ‌ణుల‌ను ట్రోల్ చేయడం వల్ల నెటిజ‌నుల‌కు కొంచెం ఎక్కువ ఆక‌ర్ష‌ణ ఆద‌ర‌ణ సాధ్య‌వుతుంది.. అని వ్యాఖ్యానించింది. షేమ్ ఆన్ యు-డ్రా ఎ లైన్-బి హ్యూమన్ వంటి హ్యాష్‌ట్యాగ్‌లను కూడా సోనాల్ జోడించింది. ఈ పోస్ట్ ఇప్పుడు ఆమె పేజీలో కనిపించనప్పటికీ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారుతున్నాయి.

సంజయ్ లీలా భ‌న్సాలీ ఎంపిక స‌రైన‌దే. షర్మిన్ సెగల్‌ను హీరామాండిలోని అలంజేబ్ పాత్ర‌కు సరైన ఎంపిక అని ఏ ఒక్క‌రూ అన‌లేదు. కానీ సోనాల్ త‌న‌ను స‌మ‌ర్థించ‌డాన్ని బ‌ట్టి త‌ను భ‌న్సాలీ దృష్టిలో ప‌డాల‌నే అలా అంటోందా? అంటూ ఇప్పుడు నెటిజ‌నులు రివ‌ర్సులో పంచ్ లు వేస్తున్నారు.

హీరామండి షో వీక్షించాక షర్మిన్‌పై తీవ్ర‌ విమర్శలు వెల్లువెత్తాయి. నెపో కిడ్ అని కూడా కామెంట్ చేసారు. ఇటీవల స్టార్ కాస్ట్ ఇంటర్వ్యూ నుండి ఒక క్లిప్ వైరల్ అయ్యింది. ష‌ర్మిన్ ఉద్ధేశ‌పూర్వ‌కంగా సంజీదా షేక్‌ను తక్కువ చేయడానికి ప్రయత్నించిందని నెటిజన్లు భావించారు. కొన్ని రోజుల క్రితం అదితి రావ్ హైదరీ - రిచా చద్దాను అగౌరవపరిచినందుకు షర్మిన్ ని నిందించారు. ఈ సంవత్సరం విడుదలై గొప్ప వీక్ష‌ణ‌ల‌ను క‌లిగిన‌ సిరీస్‌లలో హీరామండి ఒకటిగా అవతరించిన సంగ‌తి తెలిసిందే. కానీ క్రిటిక్స్ నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ట్రోలింగ్ ఎదురైనా కానీ సోనాల్ ప్ర‌య‌త్నాలు చూసైనా భ‌న్సాలీ త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ లో అవ‌కాశం క‌ల్పిస్తాడేమో చూడాలి. ప్ర‌స్తుతానికి సోనాల్ ఇన్ స్టాలో బికినీలు, మోనోకినీల‌తో చెల‌రేగుతున్న ఫోటోలు అంత‌ర్జాలంలో హీట్ పుట్టిస్తున్నాయి.