నా వైపు అలా చూడోద్దు ప్లీజ్ అంటావా?
అవకాశాలు వస్తే ఒకే భాషలో కొనసాగాలి లేదంటే? మల్టీలాంగ్వేజెస్ ని టార్గెట్ చేయాలి. ఇలా చేయగల్గేది అతి కొద్ది మంది భామలే.
By: Tupaki Desk | 1 Dec 2023 8:32 AM GMTఅవకాశాలు వస్తే ఒకే భాషలో కొనసాగాలి లేదంటే? మల్టీలాంగ్వేజెస్ ని టార్గెట్ చేయాలి. ఇలా చేయగల్గేది అతి కొద్ది మంది భామలే. అందులో సోనాల్ చౌహాన్ అనే యూపీ బ్యూటీ ఒకరున్నారని తప్పక గుర్తించాలి. అవును అమ్మడు కెరీర్ అలాగే ప్లాన్ చేసుకుని ముందుకు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. `జన్నత్ `తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అటుపై రెయిన్ బో టాలీవుడ్ లోనూ లాంచ్ అయింది.
అటుపై నటసింహ బాలయ్య సహకారంతో అతని మూడు చిత్రాల్లో ఛాన్సులందుకుంది. అవిగాక ఇంకొన్ని తెలుగు సినిమాలు చేసింది. కానీ నటిగా ఇక్కడ బిజీ కాలేదు. అదే సమయంలో ఇతర భాషల్లోనూ అంది వచ్చిన అవకాశాలు చేజార్చుకోలేదు. కోలీవుడ్..బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. వచ్చిన ఛాన్స్ మిస్ చేయకూడదు అన్న కోణంలో అమ్మడు ఏ భాషని విడిచిపెట్టలేదు.
తాజాగా బెంగాలీ లోనూ అడుగు పెట్టింది. అక్కడ `డార్డ్` అనే సినిమా చేస్తుంది. స్థానిక భాషతో పాటు హిందీలోనూ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇలా సోనాల్ కెరీర్ లో గ్యాప్ లు లేకుండా చూసుకుంటుంది. స్టార్ కాకుండా ఇలా ఛాన్సులు చేజిక్కించుకోవడం అంత ఈజీ కాదు. ట్యాలెంట్ తో పాటు మెప్పించే శక్తి సామర్ధ్యాలు ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఆ రకంగా సోనాల్ పదేళ్లకు పైగా జర్నీని దిగ్విజయంగా పూర్తిచేసింది.
ఇక సోషల్ మీడియాలో అమ్మడి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో చెమటలు పట్టిస్తుంది. డిజైనర్ దుస్తుల్లో తనదైన మార్క్ వేస్తుంది. తాజాగా అలాంటి పిక్ తో నెటి జనుల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా మిరుమిట్లు గొలిపే ఔట్ ఫిట్ లో మెరిసిపోతుంది. పొడితో కూడిన డిజైన్ సోనాల్ ని అందంగా తీర్చి దిద్దింది. ఈ ఫోటో వైరల్ సెన్షేషన్ అవుతుందని ముందుగానే గుర్తించింది. అందుకే` మీరునన్ను చూస్తున్నారు` కదా? అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చేసింది