గంగ అంటే భయం నావల్ల కాదనేసింది!
ఈ సందర్భంగా అందులో హీరోయిన్ గా నటించిన సోనాలి బింద్రే గురించి ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు.
By: Tupaki Desk | 25 Aug 2024 3:15 AM GMTమెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన హీరోగా నటించిన 'ఇంద్ర' చిత్రాన్ని మళ్లీ రీ-రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర రాసింది. సీమ బ్యాక్ డ్రాప్ సినిమాలకు కొత్త అర్దాన్నితీసుకొచ్చిన చిత్రంగా నిలిచింది. తాజాగా ఆ సినిమా అనుభూతుల్ని దర్శకుడు బి.గోపాల్ పంచుకున్నారు. ఈ సందర్భంగా అందులో హీరోయిన్ గా నటించిన సోనాలి బింద్రే గురించి ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు. అదేంటో ఆయన మాటల్లోనే...
`సోనాలి బెంద్రే .. ఆర్తి అగర్వాల్ ఇద్దరూ కూడా మంచి అందగత్తెలు. ఆ పాత్రలకు వాళ్లు సరిగ్గా సరిపోయారు. సినిమాలో సోనాలి గవర్నర్ కూతురుగా నటించింది. కాశీకి సంబంధించిన షెడ్యూల్లో ఆమె మొదటిసారిగా షూటింగులో పాల్గొన్నారు. ఆమె గంగలో మునకేసి లేవగానే, ఆమె మెడలోని పూలమాల చిరంజీవి మెడలోకి చేరుతుంది. అది సీన్.
ఈ సీన్ గురించి చెప్పగానే సోనాలి కంగారు పడిపోయింది. సార్ నాకు నీళ్లంటే చాలా భయం . మునిగితే చచ్చిపోతాను . నా వల్ల కాదు సార్` అని చెప్పింది. `అయ్యో ఆ సీన్ చాలా ఇంపార్టెంట్ .. హీరోతో ముడిపడిన సీన్ .. తప్పకుండా చెయ్యాలి .. నీ ప్రాణానానికి నా ప్రాణం అడ్డు. నీ చుట్టూ మనుషులను పెడతాను. భయపడ వలసిన పనిలేదు. ఒక్కసారి మునిగి పైకి లే చాలు` అన్నాను.
మొత్తానికి భయపడుతూనే ఆ సీన్ చేసింది. కానీ చాలా బాగా చేసింది. నేను అనుకున్నదానికంటే మంచి ఔట్ పుట్ ఇచ్చింది. థియేటర్ లో ఆ సీన్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది` అని అన్నారు.